PRIYANKA GANDHI: తెలంగాణకు ప్రియాంకా గాంధీ.. ఖానాపూర్‌లో ప్రచారం..
నాందేడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఉదయం 10.30 కు నేరుగా ఖానాపూర్ చేరుకుంటారు. అనంతరం గంటసేపు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు.

PRIYANKA GANDHI: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఆదివారం తెలంగాణలో పర్యటించబోతున్నారు. తెలంగాణలోని ఖానాపూర్, అసిఫాబాద్ ఎస్టీ నియోజక వర్గాలలో ప్రచార కార్యక్రమాలలో ప్రియాంకా గాంధీ పాల్గొంటారు. నాందేడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఉదయం 10.30 కు నేరుగా ఖానాపూర్ చేరుకుంటారు.
TDP– JANASENA CLASH: ఇదేంది.. ఇప్పుడే ఇంత గోల ! కలిసి ఎలా పోటీ చేస్తారు మరి !!
అనంతరం గంటసేపు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ నుంచి బయల్దేరి హెలికాప్టర్‌లో12 గంటలకు అసిఫాబాద్ చేరుకుంటారు. 12 గంటల నుంచి 1 వరకు అసిఫాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అక్కడ గిరిజనుల ఆరాధ్య దేవాలయం నాగోబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడ నుంచి ఒక లంబాడా తండా లో మహిళలతో కలసి ప్రచారంలో పాల్గొంటారు. దీనిలో భాగంగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై ప్రచారం నిర్వహిస్తారు.
అక్కడ మహిళలతో కలిసి గిరిజనుల ప్రత్యేక వంటకాలు వండి, భోజనం చేస్తారు. మహిళలతో కలిసి ఆర్టీసీ బస్ లో ప్రయాణం చేస్తారు. తిరిగి మద్యాహ్నం 1 గంటకు అసిఫాబాద్ నుంచి నాందేడ్ బయల్దేరి వెళ్తారు. ప్రియాంకా గాంధీ ప్రచారం కోసం కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు చేసింది.