Revanth Reddy: ఎన్నికల వేళ రేవంత్‌కు భారీ షాక్‌ ప్రధాన అనుచరుడు జంప్‌..

రాజకీయ సిత్రాలు అన్నిన్ని కాదయా అంటారు. ఆ సిత్రాలేంటో ఎన్నికలు వస్తే మరింత ఎక్కువ బయటపడుతుంటాయ్. ఒక్కసారి అసంతృప్తి మొదలైందో.. నా అనుకున్న వాళ్లు, నావాళ్లు అనే వాళ్లు కూడా ఘోరంగా హ్యాండ్ ఇస్తుంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 14, 2023 | 07:24 PMLast Updated on: Oct 14, 2023 | 7:24 PM

Congress Leader Somasekhar Reddy A Follower Of Revanth Reddy Is Also Spreading Rumors That He Will Not Resign From The Congress Party

రాజకీయ సిత్రాలు అన్నిన్ని కాదయా అంటారు. ఆ సిత్రాలేంటో ఎన్నికలు వస్తే మరింత ఎక్కువ బయటపడుతుంటాయ్. ఒక్కసారి అసంతృప్తి మొదలైందో.. నా అనుకున్న వాళ్లు, నావాళ్లు అనే వాళ్లు కూడా ఘోరంగా హ్యాండ్ ఇస్తుంటారు. జంపింగ్ జపాంగ్‌లు అంటూ పార్టీలు మారుతుంటారు. అలాంటి అనుభవమే టీపీసీసీ చీఫ్ రేవంత్‌కు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఎన్నికల వేళ కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు కనిపిస్తున్నాయ్. ప్రధాన పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలంతా.. గాంధీభవన్‌ వైపే చూస్తున్నారు. దీంతో గాంధీభవన్‌లో ఇరుకుగా మారిందనే జోకులు పేలుతున్నాయ్. కొత్త చేరికలో.. కాంగ్రెస్‌లో ఉన్న పాత నేతలకు ఇబ్బందిగా మారాయ్. దీంతో రోజురోజుకు హస్తం పార్టీలో అసంతృప్తులు పెరుగుతున్నారు. అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధం అవుతున్న వేళ.. కాంగ్రెస్‌ పార్టీకి కీలక నేతలంతా వరుసగా షాక్‌లు ఇస్తున్నారు.

టీపీసీసీ రేవంత్ రెడ్డి సన్నిహితుడు సోమశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనన్నట్లు ప్రచారం జరుగుతోంది. సోమశేఖర్ రెడ్డి.. ఉప్పల్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. ఐతే తనకు రేవంత్ రెడ్డి మద్దతు ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే ఇప్పుడు టికెట్ రాదని తేలడంతో.. పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేసేందుకు రెడీ అవుతున్నారని టాక్‌. సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డితో పాటు.. ఆయన భార్య ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీష కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో.. తెలంగాణలో ఆ పార్టీలో ఇటీవల భారీగా జరిగాయ్‌.

తెలంగాణ ఎన్నికలకు త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించనుంది. ఇలాంటి సమయంలో మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అభ్యర్థులను ఇంకా ప్రకటించక ముందే కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్. చోటుచేసుకుంటున్నాయ్. మరి ఈ వలసలు ఆగుతాయా.. ఇంకా కంటిన్యూ అవుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది.