Patnam Sunita Mahender Reddy : మల్కాజిగిరిలో కాంగ్రెస్ జోరు సునీతమ్మ గెలుపు ఖరారు..
తెలంగాణలోని ఆ ఒక్కటి మాత్రం.. హాట్ సీటుగా మారిపోయింది. అన్ని పార్టీల్లో దాని కోసం విపరీతమైన పోటీ ఉంది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్‌గిరి (Malkajigiri) లో దాదాపు 31 లక్షల మంది ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) విజయం సాధించారు.

Congress leader Sunithamma's victory in Malkajigiri is confirmed.
తెలంగాణలోని ఆ ఒక్కటి మాత్రం.. హాట్ సీటుగా మారిపోయింది. అన్ని పార్టీల్లో దాని కోసం విపరీతమైన పోటీ ఉంది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్‌గిరి (Malkajigiri) లో దాదాపు 31 లక్షల మంది ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) విజయం సాధించారు. ఇప్పుడు ఈ నియోజకవర్గం కోసమే ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీలో విపరీతమైన పోటీ ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) పట్నం సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. దీంతో గెలుపే లక్ష్యంగా పట్నం దంపతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగిన పట్నం సునితా మహేందర్‌రెడ్డి (Patnam Sunita Mahender Reddy) ప్రచారంలో దూసుకుపుతోనున్నారు.. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.. రోడ్ షోలు మీటింగ్ లు నిర్వహిస్తున్నారు.
ఇంటింటికి తిరుగుతూ.. ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నారు. అవ్వా తాత, అన్న చెల్లి అంటూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ సారి కూడా భారీ మెజార్టీతో గెలుస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం హస్తం గ్రాఫ్ తోపాటు పట్నం కుటుంబానికి పార్లమెంట్ పరిధిలో మంచి పేరు ఉంది. మొదటి నుంచి పట్నం సునీతా ప్రజా సేవకే జై కొడుతున్నారు. అనేక సేవాకార్యక్రమాలతో పాటు, అభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆమె ఏ పదవిలో ఉన్న అక్కడ మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ప్రజల మన్ననాలను అందుకున్నారు. ఆమె పనితీరుకు ఎన్నో ప్రశంసలను అందుకున్నారు. ఆమె పనితనాన్ని గుర్తించే రేవంత్ సర్కార్ ఎంపీ టికెట్ ఇచ్చింది. అందుకు తగ్గట్టుగానే విరామం లేకుండా గెలుపు కోసం సునీతా మహేందర్ రెడ్డి కష్టపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తనను గెలిపిస్తే పాలకురాలిగా కాకుండా 5 ఏళ్లు సేవకురాలిగా పనిచేస్తానని ఓటర్లకు భరోసా ఇస్తున్నారు. ఈ సారి కూడా కాంగ్రెస్ గెలుపే ఖాయమని అంటున్నారు. బీజేపీ (BJP) నుంచి ఈటెల బరిలోకి దిగుతున్నా… నాన్ లోకల్ చర్చ తెరపైకిరావడం ఆయనకు మైనస్ గా మారుతోంది. మరో వైపు రేవంత్ గెలిచిన స్థానం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, పట్నం ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ ఇవన్నీ కాంగ్రెస్ గెలుపు కు కలిసి వస్తున్న అంశాలు. సునీతామ్మ ఎండను లెక్క చేయ్యకుండా ప్రచారం చేస్తున్నారు. ఆమె ఎక్కడ ప్రచారం నిర్వహించిన భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చి … తమ మద్దతును తెలుపుతున్నారు. సర్వేలు కూడా దాదాపుగా మల్కాజిగిరిలో కాంగ్రెస్ జెంగా ఎగురుతుందని చెబుతున్నాయి. ఏ రకంగా చూసిన పట్నం సునీత మహేందర్ రెడ్డి కే గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. మరీ ఎంత మెజార్టీతో పట్నం సునీత గెలుస్తుందో చూడాలి.