Congress Manifesto “Abhyahastam” : కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. “అభయహస్తం” అని పేరుతో 42 పేజీల మేనిఫెస్టో విడుదల
ఈ సారి తెలంగాణ ను ఇచ్చిన పార్టీగా ఎలగైనా తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ఆరు గ్యారేంటీలు లతో ప్రచారం చేసినప్పటికి నేడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పూర్తి మేనిఫెస్టో ఆ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ భవన్ లో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోకు "అభయహస్తం" అని పేరు పెట్టారు కాంగ్రెస్ పార్టీ.
తెలంగాణలో ఎన్నికలు మరింత రసవంతంగా అయ్యాయి. ఎట్టకేలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ సారి తెలంగాణ ను ఇచ్చిన పార్టీగా ఎలగైనా తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ఆరు గ్యారేంటీలు లతో ప్రచారం చేసినప్పటికి నేడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పూర్తి మేనిఫెస్టో ఆ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ భవన్ లో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోకు “అభయహస్తం” అని పేరు పెట్టారు కాంగ్రెస్ పార్టీ. మొత్తం 42 పేజీలతో.. 37 ప్రధానాంశాలతో.. అనుబంధ మేనిఫెస్టో పేరిట జాబ్‌క్యాలెండర్ మరో 13 అంశాల్ని చేర్చింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఏల్పీ నేత భట్టి,శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
మేనిఫెస్టోలోని హామీలు..
- తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ₹25వేల పింఛను
- తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
- ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి 250 గజాల ఇళ్ల స్థలం
- వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్
- రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల పంట రుణమాఫీ
- రైతులకు రూ.3 లక్షల వడ్డీ లేని రుణాలు
- రైతు కూలీలకు రూ. 12 వేలు
- అన్ని పంటలకు మద్దతు ధర
- చక్కెర కర్మాగారాలు, పసుపు బోర్డు ఏర్పాటు
- భూమిలేని రైతులకు సైతం రైతు బీమా
- ధరణీ స్థానంలో ‘భూమాత’ పోర్టల్
- 18 ఏళ్లు పైబడిన ప్రతి విద్యార్థికి స్కూటీ
- నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్.. రూ. 10 లక్షలు వడ్డీ లేని రుణం
- నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4 వేల నిరుద్యోగ భృతి
- దివ్యాంగుల నెలవారీ పెన్షన్ రూ. 6 వేలకు పెంపు
- అంగన్వాడీ టీచర్లకు నెలకు రూ. 18 వేల వేతనం
- ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంపు
- కొత్తగా మూడు ఎస్టీ, మూడు ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు
- మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం రూ. 10 వేలకు పెంపు
- 50 ఏళ్లు పైబడిన జానపద కళాకారులకు రూ. 3 వేల పెన్షన్
- మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 5 లక్షలు
- రేషన్ డీలర్లకు రూ. 5 వేల గౌరవ వేతనం
- మరణించిన గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ. 5 లక్షలు పరిహారం
- ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతిరోజూ ‘ప్రజాదర్భార్’ ఏర్పాటు
- వార్షిక జాబ్ క్యాలెండర్ ద్వారా రూ.2 లక్షల ఉద్యోగాల భర్తీ
- ఆడపిల్లల పెళ్లికి రూ.లక్షతో పాటు 10 గ్రాముల బంగారం.
- కాలేజీకి వెళ్లే విద్యార్థులకు విద్యా భరోసా కింద రూ.5 లక్షలు