Congress Manifesto: కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది: మల్లికార్జున ఖర్గే

ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడింది. కొద్ది రోజులుగా కేసీఆర్‌కు భయం పట్టుకుంది. ఆయన గొంతులో ఆందోళన కనిపిస్తున్నది. మోదీ, కేసీఆర్ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 17, 2023 | 03:00 PMLast Updated on: Nov 17, 2023 | 3:21 PM

Congress Manifesto Released By Mallikarjun Kharge And Revanth Reddy

Congress Manifesto: కొద్ది రోజులుగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. శుక్రవారం కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఖర్గేతోపాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడారు. బీఆర్ఎస్‌పై విమర్శలు చేశారు. “తెలంగాణ ప్రజల బాగు కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందింది. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడింది. కొద్ది రోజులుగా కేసీఆర్‌కు భయం పట్టుకుంది. ఆయన గొంతులో ఆందోళన కనిపిస్తున్నది.

ఇది చదవండి: Congress Party “Abhayahastam” manifesto : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 42 పేజీల “అభయహస్తం” మేనిఫెస్టో

 

మోదీ, కేసీఆర్ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. జనాలు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. ఎప్పుడూ ఫాంహౌస్‌లోనే ఉండే కేసీఆర్ ఇక.. అక్కడే ఉండిపోతారు. జనాలు బై బై కేసీఆర్.. టాటా కేసీఆర్ అంటారు. విద్యార్థులు, ఉద్యోగుల బలిదానాలు చూసి సోనియా తెలంగాణ ఇచ్చారు. జనాలు బాగు పడతారని తెలంగాణ ఇస్తే.. జనాలను దోచుకునే వాళ్లు రాజ్యమేలుతున్నారు. ప్రాజెక్టులు, పథకాలు, ప్రతి దాంట్లోనూ అవినీతికి పాల్పడుతున్నారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను ఇచ్చినట్టే.. ఇక్కడా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం. కర్ణాటకలో చెప్పిన ప్రతి హామీనీ మేం నెరవేరుస్తున్నాం. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను బరాబర్ అమలు చేసి తీరుతాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేబినెట్ ఏర్పాటైన తొలి రోజే వాటిపై నిర్ణయం తీసకుంటాం. మా తొలి లక్ష్యం.. మహాలక్ష్మీ పథకం.. ప్రతి నెలా రూ.2500 అందజేస్తాం. అలాగే రూ.500కే గ్యాస్ సిలిండర్, బస్సుల్లో ఫ్ర్రీ జర్నీ వంటివి కల్పిస్తాం” అని ఖర్గే అన్నారు.

మా మేనిఫెస్టోనే భగవద్గీత: రేవంత్ రెడ్డి
మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “తెలంగాణ కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీత.. ఖురాన్.. బైబిల్. సర్వమతాలకు, తెలంగాణ ప్రజలకు ఈ మేనిఫెస్టో అంకితం చేస్తున్నాం. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాశారు. పదేళ్లు అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించారు. నమ్ముకున్నవారికి ద్రోహం చేశారు. పదేళ్లలో ఒక అహంకారపూరిత పాలనను తెలంగాణ ప్రజలు చవిచూశారు. వెనక్కి తిరిగి చూసుకుంటే.. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ప్రజల పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారు. తెలంగాణలో కాంగ్రెస్ తుఫాను రాబోతోంది. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజలు ముందుకొచ్చారు. కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేందుకు ముందుకొస్తున్నారు. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి” అన్నారు.

Chiranjeevi: మెగా ప్లానింగ్.. సరికొత్త ఊహా ప్రపంచంలోకి చిరంజీవి..

 

ఇది తెలంగాణ బిడ్డల మేనిఫెస్టో..

ఇదే కార్యక్రమలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు మాట్లాడారు. “రాష్ట్రంలో దగాపడ్డ తెలంగాణ బిడ్డల మేనిఫెస్టోని రూపోందించాం. అన్ని వర్గాల సంఘాలను, జిల్లాలో పర్యటించి ప్రజలను సంప్రదించాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హామీల్ని అమలు చేస్తాం. అభయహస్తం ద్వారా ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోని రూపొందించాం. 30వ తేదీ జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ని ఆశీర్వాదించాలి” అని శ్రీధర్ బాబు అన్నారు.