Addanki Dayakar: అద్దంకి దయాకర్‌కు మళ్లీ హ్యాండ్.. చివరి నిమిషంలో ఎమ్మెల్సీ అభ్యర్థి మార్పు..
ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి అద్దంకి దయాకర్‌కు ఇస్తామని నిన్నటివరకూ చెప్పారు. ఆయనకు ఫోన్ చేసి నామినేషన్‌కు సిద్ధంగా ఉండాలి అని కూడా చెప్పారు పార్టీ పెద్దలు. కానీ లాస్ట్ మినట్‌లో హ్యాండ్ ఇచ్చారు.
Addanki Dayakar: ఒక మనిషి విషయంలో ఒకసారి తప్పు జరిగితే అది పొరపాటు. కానీ ప్రతీ సారి జరిగితే అది అన్యాయం. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ విషయంలో ఇదే జరుగుతోంది. ఏదో ఒకసారే అనుకుంటే ప్రతీ విషయంలో పార్టీ పెద్దలు దయాకర్‌కు అన్యాయమే చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి అద్దంకి దయాకర్‌కు ఇస్తామని నిన్నటివరకూ చెప్పారు. ఆయనకు ఫోన్ చేసి నామినేషన్‌కు సిద్ధంగా ఉండాలి అని కూడా చెప్పారు పార్టీ పెద్దలు. కానీ లాస్ట్ మినట్‌లో హ్యాండ్ ఇచ్చారు.
YS SHARMILA: పెద్ద ప్లానే.. ఏపీలో కాంగ్రెస్ ప్లాన్ తెలిస్తే షాక్.. షర్మిలతో మాములు గేమ్ కాదుగా..
చివరికి ఆ ఎమ్మెల్సీ స్థానం మహేష్ కుమార్ గౌడ్‌కు దక్కింది. ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పడంతో అద్దంకి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. రేవంత్ రెడ్డి లేకపోవడంతో నామినేషన్ పత్రాలపై జగ్గారెడ్డి సైన్ చేశారని, పార్టీ బీఫాం తీసుకుని నామినేషన్‌కు సిద్ధంగా ఉండాలని కూడా చెప్పడంతో ఇక తాను ఎమ్మెల్సీ అయిపోయానని అనుకున్నారు అద్దంకి. కానీ లాస్ట్ మినట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలాగే ఆయనకు హ్యాండ్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇదే జరిగింది. తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు అద్దంకి దయాకర్. కానీ పార్టీ మాత్రం అద్దంకికి హ్యాండ్ ఇచ్చింది. దీంతో ఆయన పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ దయాకర్ మాత్రం పార్టీలోనే కంటిన్యూ అవుతానని చెప్పారు. టికెట్ ఇవ్వకపోయినా పార్టీ గెలుపు కోసం తనవంతు కృషి చేశారు.
దీంతో ప్రభుత్వం ఏర్పడిన తరువాత అద్దంకికి న్యాయం చేయాలని నిర్ణయించుకున్నారు రేవంత్ రెడ్డి. కానీ ఆయన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు దావోస్ వెళ్లారు. ఆయన అలా వెళ్లారో లేదో.. ఇలా ఇక్కడ రాజకీయ పరిణామాలు మారిపోయాయి. దయాకర్‌కు చేతి వరకూ వచ్చిన ఎమ్మెల్సీ పదవి ఇప్పుడు వేరే వాళ్లకు వెళ్లింది. ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందా.. తెలియకుండా జరిగిందా.. అనే విషయం పక్కన పెడితే దయాకర్‌కు మాత్రం ఎప్పటిలాగే అన్యాయం జరిగింది. దీంతో ఒక వ్యక్తికి కాంగ్రెస్ ఎన్నిసార్లు అన్యాయం చేస్తుంది అనేవాదనలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనప్పుడు ఓర్చుకున్న దయాకర్.. ఇప్పుడు ఆశ పెట్టి వెనక్కి తీసుకున్న ఎమ్మెల్సీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.