Congress Bank Accounts: కాంగ్రెస్ పార్టీకి షాక్.. బ్యాంకు ఖాతాల స్తంభన.. ఆ వెంటనే

2018-19 సంవత్సరానికిగాను సరైన సమయంలో బ్యాంకు ఖాతాల వివరాలను సమర్పించని కారణంగా బ్యాంకు ఖాతాల్ని ఇన్‌కమ్ ట్యాంక్స్ డిపార్ట్‌మెంట్ నిలిపివేసింది. ఆ సమయంలో కాంగ్రెస్.. 45 రోజులు ఆలస్యంగా లావేదేవీల వివరాలు సమర్పించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 16, 2024 | 04:21 PMLast Updated on: Feb 16, 2024 | 4:21 PM

Congress Party Gets Tax Tribunal Relief After Bank Accounts Frozen By I T Department Claim

Congress Bank Accounts: కాంగ్రెస్ పార్టీకి ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. ఆ పార్టీ బ్యాంకు అకౌంట్లు స్తంభింపజేసింది. దీనిపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. ఐటీ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను కాంగ్రెస్ ఆశ్రయించింది. అయితే, ఆ తర్వాత ఐటీ ట్రిబ్యునల్ ఆదేశాలతో కొద్ది గంటల్లోనే బ్యాంకు ఖాతాల్ని తిరిగి పునరుద్ధరించింది. ఈ విషయంలో కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.

Paytm FASTag: పేటీఎంకు మరో బిగ్ షాక్.. ఫాస్టాగ్ జారీ నుంచి పేటీఎం అవుట్

2018-19 సంవత్సరానికిగాను సరైన సమయంలో బ్యాంకు ఖాతాల వివరాలను సమర్పించని కారణంగా బ్యాంకు ఖాతాల్ని ఇన్‌కమ్ ట్యాంక్స్ డిపార్ట్‌మెంట్ నిలిపివేసింది. ఆ సమయంలో కాంగ్రెస్.. 45 రోజులు ఆలస్యంగా లావేదేవీల వివరాలు సమర్పించింది. ఈ కారణంగానే తమ బ్యాంకు ఖాతాల్ని ఐటీ శాఖ నిలిపివేసిందని, ఇందులో రాజకీయ దరుద్దేశమే కనిపిస్తోందని కాంగ్రెస్ నేత, పార్టీ ట్రెజరర్ అజయ్ మాకెన్ అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఇలా చేయడం సరికాదన్నారు. రూ.210 కోట్లు పన్ను చెల్లించాలని ఐటీ శాఖ కోరుతోందన్నారు. బ్యాంకు ఖాతాలు స్తంభించిపోవడంతో కరెంటు బిల్లులు చెల్లించేందుకు, సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు కూడా నిధులు లేనవి అజయ్ మాకెన్ తెలిపారు. ఈ అంశంపై పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ఇలా సాగుతుండగానే కాంగ్రెస్‌కు రిలీఫ్ దొరికింది.

బ్యాంకు ఖాతాల్ని ఐటీ శాఖ పునరుద్ధరించింది. అయితే, బ్యాంకు ఖాతాల్లో రూ.115 కోట్ల నగదు ఉంచాలని ఐటీ శాఖ.. కాంగ్రెస్‌కు సూచించింది. ఈ విషయంలో కాంగ్రెస్ వాదనల్ని బుధవారం వింటామని, ఆ తర్వాత పన్ను చెల్లింపు, బ్యాంకు ఖాతాల విషయంలో నిర్ణయం తీసుకుంటామని ఐటీ అప్పీలేట్ ట్రిబ్యునల్ వెల్లడించింది. కాగా, ఐటీ శాఖ చర్యను కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించింది.