Congress Manifesto: కాంగ్రెస్ మేనిఫెస్టో రెడీ.. కీలక హామీలివే..!
గతంతో పోలిస్తే.. కాంగ్రెస్ ఇటీవల బాగా పుంజుకుంది. ప్రస్తుతం పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంది. అందుకే గెలుపు అవకాశాల్ని మరింత మెరుగుపర్చుకునేలా ఈ మేనిఫెస్టో రూపొందించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉండబోయే కొన్ని కీలక హామీలివే.

Congress Manifesto: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మేనిఫెస్టో విడుదల చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ రెడీ అయ్యింది. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఈ మేనిఫెస్టోను శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేయబోతున్నారు. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకెళ్తున్న సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే.. కాంగ్రెస్ ఇటీవల బాగా పుంజుకుంది. ప్రస్తుతం పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంది. అందుకే గెలుపు అవకాశాల్ని మరింత మెరుగుపర్చుకునేలా ఈ మేనిఫెస్టో రూపొందించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉండబోయే కొన్ని కీలక హామీలివే. ధరణి స్థానంలో భూ భారతి పేరుతో మరింత మెరుగైన సేవను అందుబాటులోకి తేనుంది కాంగ్రెస్. బీఆర్ఎస్ తెచ్చిన ధరణిని కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
Vijayashanti: ఏం చేస్తున్నరో.. మీకైనా క్లారిటీ ఉందా రాములమ్మ..!
గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనం, రేషన్ డీలర్లకు గౌరవ వేతనంతోపాటు కమీషన్, ఆర్ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు కార్డులు, పెళ్లి కూతురుకు కానుకగా లక్ష రూపాయలతో పాటు తులం బంగారం, రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం, అభయహస్తం పథకం తిరిగి పునరుద్ధరణ, అమ్మహస్తం పేరుతో 9 నిత్యావసర వస్తువుల పంపిణీ, ఎంబీసీలకు ప్రత్యేక కార్పొరేషన్, ట్రాన్స్‌జెండర్లకు ఆటోలు, ప్రత్యేక సంక్షేమ పథకాలు, జర్నలిస్టుల కోసం ప్రత్యేక పథకంతోపాటు మెట్రోలో ఉచిత ప్రయాణం, సిటిజన్ చార్ట్‌కు చట్టబద్ధత, విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం అమలు, ఉద్యోగాల కల్పన, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం వంటి హామీలను కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చేర్చినట్లు తెలుస్తోంది.