CONGRESS: కాంగ్రెస్‌లో సస్పెన్స్‌.. సీఎం ప్రకటన ఇవాళ లేనట్టే..

మెజార్టీ ఎమ్మెల్యేల్లోనే కాదు.. కాంగ్రెస్‌ హైకమాండ్‌లో కూడా రేవంత్‌కే ఆ పదవి ఇవ్వాలని ఉన్నట్టు తెలుస్తోంది. మీటింగ్‌ ముగిసిన తరువాత సాయంత్రం రేవంత్‌ పేరు ఖరారు చేస్తారని అంతా అనుకున్నారు. ఇవాళ రాజ్‌భవన్‌లో సీఎం ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని ప్రకటించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 4, 2023 | 06:20 PMLast Updated on: Dec 04, 2023 | 6:20 PM

Congress Postponed Tp Announce Cm Name To Tomorrow

CONGRESS: తెలంగాణ కాంగ్రెస్‌లో టెన్షన్‌ కనిపిస్తోంది. ఊహించని మెజార్టీతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీలో సస్పెన్స్‌ కొనసాగుతోంది. కాంగ్రెస్‌ నుంచి తెలంగాణకు కాబోయే కొత్త సీఎంను ఎన్నకునేందుకు ఉదయం నుంచి సీఎల్పీ మీటింగ్‌ నిర్వహించింది పార్టీ హైకమాండ్‌. విడివిడిగా ఎమ్మెల్యేల ఒపీనియన్‌ తీసుకుంది. డీకే శివకుమార్‌తో పాటు.. పార్టీ ఇంచార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడారు. మధ్యాహ్నానికల్లా క్లారిటీ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ మీటింగ్‌లో ఎలాంటి క్లారిటీ లేదు.

BRS : బీఆర్ఎస్ కి సీమాంధ్రుల అండ… అసలు సీక్రెట్ ఇదే !

చివరికి ఎలాంటి అప్‌డేట్‌ లేకుండా మీటింగ్‌ కంప్లీట్‌ చేశారు. కానీ పార్టీ ఇంటర్నల్‌గా వినిపిస్తున్న మాట ఒక్కటే.. తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి అని. మెజార్టీ ఎమ్మెల్యేల్లోనే కాదు.. కాంగ్రెస్‌ హైకమాండ్‌లో కూడా రేవంత్‌కే ఆ పదవి ఇవ్వాలని ఉన్నట్టు తెలుస్తోంది. మీటింగ్‌ ముగిసిన తరువాత సాయంత్రం రేవంత్‌ పేరు ఖరారు చేస్తారని అంతా అనుకున్నారు. ఇవాళ రాజ్‌భవన్‌లో సీఎం ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని ప్రకటించారు. సీఎంతో పాటు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు. కానీ ఇక్కడే సీఎం ప్రకటనకు బ్రేక్‌ పడింది. ఢిల్లీ నుంచి ఫోన్‌ రావడంతో డీకే శివకుమార్‌ వెంటనే ఢిల్లీకి బయల్దేరారు. రేపు శివకుమార్‌తో పాటు.. పార్టీ పరిశీలకులతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ చర్చించనుంది. ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనే విషయాన్ని నిర్ణయించి.. సీఎం పేరును కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ప్రకటించబోతున్నారు. దీంతో ప్రస్తుతానికి సీఎం అభ్యర్థి ప్రకటన లేనట్టే అని తెలుస్తోంది.

సాయంత్రానికల్లా సీఎం ఎవరో తెలిస్తే సంబరాలు చేసుకునేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు రెడీగా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రకటనకు బ్రేక్‌ పడింది. మరో పక్క తెలంగాణ అసెంబ్లీని కూడా రద్దు చేశారు. కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేల లిస్ట్‌ను ఎన్నికల అధికారులు గవర్నర్‌కు అందించారు. కొత్త ఎమ్మెల్యేలతో సభ నిర్వహించేందుకు అసెంబ్లీ ముస్తాబవుతోంది. ఇక సీఎం పేరు ప్రకటించడమే తరువాయి. తెలంగాణ అసెంబ్లీలో సీఎం హోదాలో అడుగుపెట్టే కాంగ్రెస్‌ నేత ఎవరు అనేది రేపు తెలియబోతోంది.