CONG SURVEYS : కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ ఆలస్యం ? 13సీట్లల్లో సునీల్ టీమ్ సర్వే
తెలంగాణలో గెలిచే వాళ్ళకే టిక్కెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ (Congress) హైకమాండ్ డిసైడ్ అయింది. అందుకే లోక్ సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.
తెలంగాణలో గెలిచే వాళ్ళకే టిక్కెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ (Congress) హైకమాండ్ డిసైడ్ అయింది. అందుకే లోక్ సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఫస్ట్ లిస్టులో నలుగురు అభ్యర్థులు ప్రకటించగా… ఇంకా 13మంది పేర్లను పెండింగ్ లో పెట్టింది. ఆశవాహులు భారీగానే అప్లయ్ చేసుకున్నారు. పైరవీలు చేసేవాళ్ళు కాదు… గెలిచేదెవరు అన్నది చూస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. అందుకే మళ్ళీ ఆ 13 నియోజకవర్గాల్లో లాస్ట్ మినిట్ సర్వేలు జరుగుతున్నాయి. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ (A political strategist) సునీల్ కనుగోలు టీమ్ ఈ సర్వేల్లో బిజీగా ఉంది.
తెలంగాణలో ఇంకా 13 లోక్ సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించాల్సి ఉంది. గతంలో సునీల్ కనుగోలు టీమ్ ఇచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారం… ఒక్కో సీటులో నాలుగు పేర్లు ఫైనల్ చేశారు AICC పెద్దలు. అయితే వీళ్ళల్లో కొందరిపై స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల నుంచి వ్యతిరేకత వస్తోంది. కొందరు BRS నుంచి ఈమధ్యే వచ్చి కాంగ్రెస్ చేరిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి జంపింగ్స్ కి టిక్కెట్లు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారు. మొదటి నుంచీ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయరా అని ప్రశ్నిస్తున్నారు. అందుకే సెకండ్ లిస్ట్ అనౌన్స్ చేయడంపై కాంగ్రెస్ హైకమాండ్ తర్జన భర్జన పడుతోంది. AICC కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయినా కూడా అభ్యర్థులను ఫైనల్ చేయలేకపోయింది. ఈ సోమవారం నాడు కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే పేర్లను రిలీజ్ చేసే ఛాన్సుంది. తెలంగాణకు సంబంధించి మూడో లిస్ట్ కూడా ఉంటుందని చెబుతున్నారు.
ఖమ్మం, పెద్దపల్లి, నాగర్ కర్నూల్ సీట్లకు పోటీ పడుతున్న వారిపై ఎక్కువగా కంప్లయింట్స్ వస్తున్నాయి. అందుకే ఈ మూడు స్థానాలను ఫైనల్ చేయడం ఛాలెంజ్ గా మారిందని AICC లీడర్లు చెబుతున్నారు. అలాగే నాగర్ కర్నూల్, చేవెళ్ళ, భువనగిరి, వరంగల్ సీట్లకు పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. 13 స్థానాల్లో గెలిచే అభ్యర్థులు ఎవరో… సునీల్ కనుగోలు టీమ్ తో లాస్ట్ మినిట్ సర్వేలను చేయిస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. నియోజకవర్గాల్లో ఈ సర్వేలు సీక్రెట్ గా జరుగుతున్నాయి. ఆ సర్వేల్లో సూచించిన అభ్యర్థులకే కాంగ్రెస్ టిక్కెట్లు ఇచ్చే అవకాశముందని అంటున్నారు. మొత్తం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ అవడానికి ఇంకా కొంత టైమ్ పట్టే ఛాన్సుంది.