CONGRESS VS BJP: మాటలయుద్ధం.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తారా.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ..

తమ ప్రభుత్వాన్ని కూల్చేస్తే చూస్తూ ఊరుకుంటామా అని ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా.. ఇదేమైనా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అనుకున్నారా అని ప్రశ్నించారు కోమటి రెడ్డి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 30, 2024 | 04:53 PMLast Updated on: Mar 30, 2024 | 8:16 PM

Congress Vs Bjp Congress Leaders Fires On Bjp Over They Can Pull Down Govt

CONGRESS VS BJP: కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. మేం గేట్లు తెరిస్తే కాంగ్రెస్ ఖాళీ అవుతుందన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేస్తే చూస్తూ ఊరుకుంటామా అని ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా.. ఇదేమైనా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అనుకున్నారా అని ప్రశ్నించారు కోమటి రెడ్డి.

PAWAN KALYAN: జనసేన మచిలీపట్నం అభ్యర్థిగా బాలశౌరి.. మరో రెండు స్థానాలు పెండింగ్

అవసమైతే బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలే కాంగ్రెస్‌లోకి వస్తారని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యేల్ని టచ్ చేస్తే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. బీజేపీ గేట్లు ఎత్తితే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరికీ అమ్ముడుపోరని, కాంగ్రెస్ మంత్రులే తమతో టచ్‌లో ఉన్నారని చెప్పుకొచ్చారు. తాను షిండే అవుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో గడ్కరీతో అన్నారని.. మంత్రులు తమ అధిష్ఠానంతో టచ్‌లో ఉన్నారని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. తమ్ముడి భార్యకు టిక్కెట్ రాకుండా చేసింది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డియే అని ఆయనపై ఆరోపణలు గుప్పించారు. అసలు మీ తమ్ముడు మీతో టచ్‌లో ఉన్నారో లేదో తెలుసుకోవాలని కోమటిరెడ్డిని ఉద్దేశించి అన్నారు. సీఎం పదవిపై పదిమంది మంత్రులు కన్నేశారన్నారు. రేవంత్ రెడ్డి వసూళ్ల చిట్టా తమ వద్ద ఉందని, ఆర్ ట్యాక్స్ కింద రూ.3వేల కోట్లు వసూలు చేశారని ఆరోపించారు.

టెలిఫోన్‌ యాక్ట్‌ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినదని, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు సీబీఐకి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు.. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే తమ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడాలని సవాల్ విసిరారు. దేన్నైనా ఎదుర్కొనే శక్తి తమ ప్రభుత్వానికి ఉందన్నారు. కొంతమంది మూర్ఖులు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలన్నారు. మొత్తంగా ప్రభుత్వాన్ని కూల్చే సత్తా ఉందని బీజేపీ నేతలు అంటుంటే.. అవసరమైతే బీజేపీ ఎమ్మెల్యేలే తమతో వస్తారని కాంగ్రెస్ అంటోంది.
https://www.youtube.com/watch?v=4yq4RoyevvY