Vishnuvardhan Reddy: పీజేఆర్ కొడుక్కి దక్కని టికెట్.. జంప్ చేసే ఆలోచన.. ఏ పార్టీలోకి ?
కాంగ్రెస్ సెకండ్ లిస్ట్‌లో చాలా సంచలనాలు కనిపించాయ్. గద్దర్ కూతురుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్.. పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత నేత పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డికి మాత్రం హ్యాండ్ ఇచ్చింది.

Congress which did not give ticket to PJR's son Vishnuvardhan Reddy.. It is reported that the party is thinking of switching
కాంగ్రెస్ సెకండ్ లిస్ట్‌లో చాలా సంచలనాలు కనిపించాయ్. గద్దర్ కూతురుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్.. పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత నేత పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డికి మాత్రం హ్యాండ్ ఇచ్చింది. వరుసగా రెండుసార్లు ఓడిన నేతలకు టికెట్ ఇవ్వొద్దని కాంగ్రెస్ డిసైడ్ అయింది. అందుకే విష్ణువర్ధన్‌కు టికెట్ రాలేదనే చర్చ జరుగుతోంది. ఐతే అదే కండిషన్ అందరికీ వర్తించదా అనే అనుమానం కూడా సెకండ్ లిస్ట్ పరిశీలిస్తే కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు విష్ణువర్ధన్ పరిస్థితి ఏంటా అనే చర్చ సాగుతోంది.
కాంగ్రెస్ నుంచి పోటీ చేయటానికి టికెట్ ఆశించి భంగపడిన విష్ణువర్థన్ రెడ్డి.. పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయ్. కాంగ్రెస్ సెకండ్ లిస్టులో.. పేరు ఉంటుందని ఆశించారు. అందుకు భిన్నంగా పార్టీ అధిష్టానం నిర్ణయం ఉండటంతో షాక్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలని భావించారు విష్ణు. అయితే పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఆ స్థానంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను బరిలోకి దింపింది. ఐనా సరే తాను ఎన్నికల బరిలో ఉంటానని చెప్తున్న విష్ణువర్ధన్ రెడ్డి.. ఇప్పుడు పార్టీ మారాలనే ఆలోచన చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.
విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఖరారు కావటంతో.. ఇక బీజేపీ పార్టీలో చేరి.. కమలం గుర్తుపై పోటీ చేయాలనే ఆలోచన చేస్తున్నారట. ఈ మేరకు బీజేపీ నేతలతో చర్చలు కూడా మొదలుపెట్టారని టాక్. దీనిపై విష్ణు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. బీజేపీలోకి విష్ణు అనే వార్తలు, ప్రచారాన్ని మాత్రం ఖండించడం లేదు. బీజేపీలోకి చేరతారా లేక స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అనేది ఇంకా క్లారిటీకి రాలేదు. పోటీ చేసేది మాత్రం ఖాయం అంటున్న విష్ణు నిర్ణయం మాత్రం గట్టిగానే ఉంది. అది పార్టీల నుంచా లేక స్వతంత్రంగానే అనేది మరికొన్ని రోజుల్లో ఫైనల్ కానుంది.