Arvind Kejriwal: ఏం చేద్దామనుకుంటున్నారు.. జైలులో కేజ్రీవాల్‌ను అంతం చేసే కుట్ర జరుగుతోందా..?
కేజ్రీవాల్‌ను బయటికి తీసుకువచ్చేందుకు ఆయన లీగల్ టీం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కానీ కేజ్రీవాల్ బెయిల్‌ను అడ్డకునేందుకు ఈడీ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి ఓ సంచలన ఆరోపణ చేశారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసు దేశ రాజకీయాల్లో క్రియేట్ చేసిన వైబ్రేషన్స్ అంతా ఇంతా కాదు. ఏకంగా ఢిల్లీ సీఎంను కూడా జైలుపాలు అయ్యారు. లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్ పాత్ర కూడా ఉందంటూ ఈడీ ఆయనను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన తిహార్ జైలులో ఉన్నారు. కేజ్రీవాల్‌ను బయటికి తీసుకువచ్చేందుకు ఆయన లీగల్ టీం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కానీ కేజ్రీవాల్ బెయిల్‌ను అడ్డకునేందుకు ఈడీ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
CM Revanth Reddy: మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తారా.. కాపలాగా నేనున్నా: రేవంత్ రెడ్డి
ఇదే క్రమంలో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి ఓ సంచలన ఆరోపణ చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌ను జైలులోనే చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ కారణంగానే ఆయనకు షుగర్ ఎక్కువైనా కూడా ఇన్సులిన్ ఇంజక్షన్ ఇచ్చేందుకు అధికారులు అనుమతించడంలేదంటూ ఆప్ మంత్రి ఆతిషి మార్లేనా సంచలన అరోపణ చేశారు. ఇంటి నుంచి తీసుకువచ్చిన భోజనం కూడా కేజ్రీవాల్‌కు అందకుండా చేస్తున్నారంటూ ఆరోపించాఉ. ఐతే ఇదే వాదనను ఈడీ అధికారులు తిప్పికొడుతున్నారు. షుగర్ లెవెల్స్ పెంచేందుకు కావాలనే కేజ్రీవాల్ స్వీట్స్, షుగర్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ తింటున్నారంటూ చెప్పారు. ఇలా చేస్తే షుగర్ ఎక్కువై ఆ కారణంతో బెయిల్ తీసుకోవచ్చనే కేజ్రీవాల్ ఇలా చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. షుగర్ తీసుకుంటున్నారు కాబట్టే ఇంటి నుంచి వచ్చే భోజనాన్ని కేజ్రీవాల్‌కు ఇవ్వడంలేదని చెప్పారు. కానీ కేజ్రీవాల్ లాయర్స్ మాత్రం ఈ వాదనను డిఫెండ్ చేశారు.
షుగర్ పేషెంట్స్ వాడాల్సిన షుగర్ మాత్రమే కేజ్రీవాల్ ఫుడ్‌లో వాడుతున్నారంటూ చెప్పారు. కావాలంటే కేజ్రీవాల్ తినాల్సి ఫుడ్ డైట్ ప్లాన్ చెప్తే ఆ భోజనమే తెప్పిస్తామంటూ చెప్పారు. వీళ్ల వాదనలు ఎలా ఉన్నా.. షుగర్ పేషెంట్లకు షుగర్ ఎప్పుడైనా పడిపోయే ఛాన్స్ ఉంది. ఇందుకో తీపి వస్తువులను పేషెంట్స్ అందుబాటులో ఉంచుకోవాలని డాక్టర్లే సూచిస్తుంటారు. అలాంటి కేజ్రీవాల్‌కు సరైన ఫుడ్ ఇవ్వకుండా ఈడీ విమర్శలపాలవుతోంది.