వచ్చే నెలలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ మెగా టోర్నీకి ముందు వివాదం చెలరేగింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే మ్యాచ్‌ను బహిష్కరించాలని ఇంగ్లండ్‌కు చెందిన ప్రజాప్రతినిధులు ఆ దేశ క్రికెట్ బోర్డును కోరారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం మహిళల హక్కులపై ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో ఇంగ్లండ్ పొలిటీషియన్స్ ఈ మేరకు పిలుపునిచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ ఫిబ్రవరి 26న ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని 160 మందికి పైగా రాజకీయ నాయకులు ఈసీబీకి విజ్ఞప్తి చేశారు. అయితే ఇంగ్లండ్ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తిని ఈసీబీ తిరస్కరించినట్లు సమాచారం. క్రీడలకు రాజకీయ కారణాలు ముడిపెట్టొద్దని కోరినట్టు తెలుస్తోంది.[embed]https://www.youtube.com/watch?v=RBSFr_Tc6-I[/embed]