Loco Pilot: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ మృతి..
దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్‌లో మృతుల సంఖ్య పెరుగుతోంది. కోరమాండల్ ట్రైన్ నడిపిన లోకో పైలట్ మహంతి ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయారు.
ట్రైన్ ఇంజిన్ గూడ్స్ ట్రైన్‌ను ఢీ కొట్టడంతో క్యాబిన్‌లో ఉన్న మహంతి తీవ్రంగా గాయపడ్డాడు. 3 రోజులు మృత్యువుతో పోరాడిన మహంతి నిన్న పరిస్థితి విషయమించడంతో చికిత్స కొనసాగుతుండగానే చనిపోయారు. ఈ ఘటనలో ఇప్పటే 300 మందికి పైగా చనిపోగా.. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. చాలా మంది డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లినప్పటికీ వందల మంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. చాలా మంది మృతదేహాలు ఇంకా హాస్పిటల్‌లోనే ఉన్నాయి.
జన్‌రల్ బోగీలో చనిపోయినవారి వివరాలు సేకరించడం పోలీసులకు సవాలుగా మారింది. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వాళ్ల కుటుంబ సభ్యులకు సమాచారమివ్వడం కష్టంగా ఉందని పోలీసులు చెప్తున్నారు. శుక్రవారం రాత్రి చనిపోయిన వారి మృతదేహాలు కూడా చాలా వరకూ ఇంకా మార్చురిలోనే ఉన్నాయి. అయితే ఎక్కువ మొత్తంలో మృతదేహాలను భద్రపర్చడం డాక్టర్లకు సవాలుగా మారింది.
హాస్పిటల్‌లో ఉన్న కెపాసిటీకి మించి మృతదేహాలు ఉండటంలో కొన్ని మృతదేహాలు డీకంపోజ్ అవుతున్నాయి. చాలా మంది తమ కుటుంబ సభ్యులను ఆధార్ కార్డ్, వాళ్ల దగ్గర ఉన్న కొన్ని వస్తువు ద్వారానే గుర్తుపడుతున్నారు. ఇప్పటికీ చాలా మంది తమ కుటుంబ సభ్యుల మృతదేహాలు గుర్తించలేకపోతున్నారు. వాళ్ల ఏడుపు అరణ్య రోదనగా మిగులుతోంది.