Corona Cases: 60 వేలు దాటిన కరోనా కేసులు రాబోయే రోజులు భయంకరంగా ఉంటాయా

కరోనాను అంతా లైట్‌ తీసుకున్నారు. ఎక్కడా ఎవరూ మాస్క్‌లతో కనిపించడంలేదు. సోషల్‌ డిస్టెన్స్‌ ఎవరూ పాటించడంలేదు. శానిటైజర్‌ స్పెల్లింగ్‌ కూడా చాలా మంది మర్చిపోయినట్టున్నారు. అందుకే కరోనా కేసులు మళ్లీ కంట్రోల్‌ లేకుండా పెరిగిపోతున్నాయి. ప్రతీ రోజూ 10 వేలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయి. సరిగ్గా నాలుగు వారాల క్రితం పరిస్థితి వేరేలా ఉండేది. అప్పుడు రెండు వేల కేసులు వస్తే అదే ఎక్కువ. కానీ జస్ట్‌ త్రీ వీక్స్‌లో సిచ్యువేషన్‌ మారిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 19, 2023 | 03:15 PMLast Updated on: Apr 19, 2023 | 3:15 PM

Corona Cases In India

ఇక లాస్ట్‌ వన్‌ వీక్‌ నుంచి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ప్రతీ రోజూ వస్తున్న కొత్త కేసుల సంఖ్య 10 వేలకు పైనే ఉంటోంది. జస్ట్‌ ఈ 24 గంటల్లోనే 10 వేల 542 కొత్త కరోనా కేసులు ఇండియాలో నమోదయ్యాయి. 2 లక్షల 40 వేల 14 మందికి కరోనా టెస్ట్‌లు చేస్తే.. అందులో 10 వేల 542 మందికి కరోనా ఉన్నట్టు తేలింది. దీంతో ఇప్పుడు ఇండియాలో ఉన్న కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 63 వేల 562కు చేరింది. డెత్‌ టోల్‌ కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 38 మంది కరోనాకు బలయ్యారు. చాలా వరకూ మరణాలు కేరళలో నమోదయ్యాయి.

ఈ సరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే రాబోయే రోజులు భయంకరంగా ఉండబోతున్నాయనేది ఇక్క సాడ్‌ ట్రూత్‌. కరోనా వ్యాప్తికి కొత్త వేరియంట్‌ ఒక కారణమైతే.. ప్రజలు జాగ్రత్తలు పాటించకపోవడం మరో కారణం. ఒకప్పటితో కంపేర్‌ చేస్తే జనాల్లో కరోనా అంటే భయం పోయింది. వారం రోజులు టాబ్లెట్స్‌ వాడితే తగ్గిపోతుందిలే అనే నెగ్లిజెన్స్‌ వచ్చేసింది. ఈ మహమ్మారి ఎంతమంది ప్రాణాలను గాల్లో కలిపేసిందో అంతా మర్చిపోయినట్టున్నారు. అందుకే ఇంత లైట్‌ తీసుకుంటున్నారు. కొత్త వేరియంట్‌ చాలా ఫాస్ట్‌గా స్ర్పెడ్‌ అవుతుందని తెలిసినా ఎవరూ జాగ్రత్తలు పాటించడంలేదు. కాపాడేందుకు వాక్సిన్‌ ఉంది కదా అనే భరరోసాతో చాలా మంది ఉన్నట్టున్నారు. కానీ మన జాగ్రత్త తప్ప వైరస్‌ నుంచి ఏదీ మనల్ని కాపాడలేదు. మన ముందు ఉన్న ఆప్షన్స్‌ను పక్కన పెట్టి.. పర్సనల్‌ కేర్‌ తీసుకోకపోతే.. కరోనా సృష్టించే కల్లోలానికి మరోసారి గురికాక తప్పదు.