Corona, New Year effect, Egg prices : కరోనా, న్యూ ఇయర్ ఎఫెక్ట్.. కోడిగుడ్డు ధరలకు మళ్లీ రెక్కలు.. ఒక్కొక్క గుడ్డు ఎంతో తెలుసా..?
గత కొద్దిరోజుల నుంచి కోడి గుడ్ల ధరల కు రెక్కలోచ్చాయి. రోజు రోజుకు వాటి దరలు పెరుగుతూ పొతున్నాయి. గత నెలలో కార్తీక మాసం కారణంగా నాన్ వెజ్ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.. దీంతో కిలో చికెన్ కూడా 100 కేజీ కి అమ్ముడు పోయింది. కాగా ఇప్పుడు కాథ మారింది. ఈ వారం నుంచి ధరలు భారీగా పెరిగాయి. చికనే కాదు.. కోడు గుడ్డు ధరలు కూడా కొండేక్కి కూర్చున్నాయి. కేవలం వారం వ్యవధుల్లోనే మరోసారి ధరలు పెరిగాయి. ఇందులో హైదరాబాద్ లోనే కోడి గుడ్డు ధర అత్యందికంగా పలుకుంది.
గత కొద్దిరోజుల నుంచి కోడి గుడ్ల ధరల కు రెక్కలోచ్చాయి. రోజు రోజుకు వాటి దరలు పెరుగుతూ పొతున్నాయి. గత నెలలో కార్తీక మాసం కారణంగా నాన్ వెజ్ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.. దీంతో కిలో చికెన్ కూడా 100 కేజీ కి అమ్ముడు పోయింది. కాగా ఇప్పుడు కాథ మారింది. ఈ వారం నుంచి ధరలు భారీగా పెరిగాయి. చికనే కాదు.. కోడు గుడ్డు ధరలు కూడా కొండేక్కి కూర్చున్నాయి. కేవలం వారం వ్యవధుల్లోనే మరోసారి ధరలు పెరిగాయి. ఇందులో హైదరాబాద్ లోనే కోడి గుడ్డు ధర అత్యందికంగా పలుకుంది.
రెండు, మూడు వారాల కిందటా.. ఒక్క కోడి గుడ్డు ధర 6 రూ.ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూపాయి పెరిగి.. 7 కు చేరింది. హోల్ సేల్లో ఒక్కో గుడ్డు రూ.5.80 పలుకుతోంది. కొన్ని రోజులుగా చలి బాగా పెరిగింది. దీంతో వెచ్చదనం కోసం ఆహారంలో కోడిగుడ్ల వినియోగం భారీగా పెరిగిందని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఎగ్స్కు ఫుల్ డిమాండ్ ఉందని చెబుతున్నారు. మిగితా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో కోడిగుడ్ల వాడకం ఎక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు.
న్యూ ఇయర్ ఎఫెక్ట్..
మొన్నటి వరకు రూ. 6 రూపాయల వరకు ఉన్న ధర.. మళ్లీ 50 పైసలు లేదా రూపాయి పెరిగే అవకాశం ఉంది. న్యూ ఇయర్ వేళ కేకులకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటి తయారీలో కోడి గుడ్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో గుడ్డు ధరలు పెరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో రూ. 6. 50కు అమ్ముతున్నారు. ఇదీ కాస్త రూ. 7 రూపాయలకు చేరే అవకాశం కూడా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు కోళ్ల ఫారాలు మూసివేశారు. ఫలితంగా కోడి గుడ్ల ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. దీనికితోడు వినియోగం పెరగడంతో ఇక కోడిగుడ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కూడా ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషణలు చెప్తున్నారు. ప్రస్తుతం లెక్కల ప్రకారం దేశంలో రోజూ 25 కోట్లకుపైగా కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నప్పటికీ.. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి సరిపోవటం లేదు. మరోవైపు నాటు కోడి గుడ్డు ధర కూడా ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో రూ.10 నుంచి రూ.13 వరకు విక్రయిస్తున్నారు.
కరోనా ఎఫెక్ట్..
ఇప్పుడు దేశంలో పరిస్థితులు కూడా అంతగా బాలేవు.. తగ్గిపోయిన అనుకున్న మహ్మారీ కరోనా మళ్లీ వ్యాప్తి చెందుతోంది. దీంతో మళ్లి మాస్క్, సానిటైజర్ వినియోగంతో పాటూగా.. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రజలు మళ్లీ కోడి గుడ్ల ను రోజుకు ఒకటైన తినడం అలవాటు చేసుకుంటున్నారు. గతంలో కరోనా టైమ్ లో కోడి గుడ్ల వినియోగం భారీగా పెరిగిందని, ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయన్న ప్రచారంతో చాలామంది ఎగ్స్ తినేందుకు మొగ్గు చూపుతున్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణలోనే కోడిగుడ్ల ఉత్పత్తి ఎక్కువ. మన దగ్గర ఉత్పత్తి అవుతున్న ఎగ్స్ లో దాదాపు 50 శాతం ఢిల్లీ, ముంబై సిటీలతో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇక రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు చికెన్ ధరలు కూడా భగ్గుమంటున్నాయి.