Raja Singh : రోజులు లెక్కపెట్టుకో.. లేపేస్తాం.. రాజాసింగ్‌కు బెదిరింపు.. ఎవరంటే..
బీజేపీ (BJP) ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) కు మరోసారి బెదిరింపు కాల్స్ (Bomb Calls) వచ్చాయ్. పలు నంబర్ల నుంచి ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా చెప్పారు.

Count the days.. we will wake up.. Rajasingh is threatened.. who..
బీజేపీ (BJP) ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) కు మరోసారి బెదిరింపు కాల్స్ (Bomb Calls) వచ్చాయ్. పలు నంబర్ల నుంచి ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా చెప్పారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ నెంబర్లను కాల్ లిస్ట్ స్క్రీన్ షాట్ ను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. బెదిరింపు కాల్స్‌పై రాజాసింగ్ తన మార్క్ రియాక్షన్ ఇచ్చారు. ఇలాంటి కాల్స్ తనకు కొత్తేమీ కాదని.. వీటిపై గతంలో ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అయినా ఒక బాధ్యత గల పౌరుడుగా పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు ట్విట్టర్‌లో చెప్పారు.
గతంలో రాజాసింగ్‌ను చంపేస్తామంటూ దుండగులు బెదిరింపు కాల్స్ చేశారు. అవన్నీ పాకిస్థాన్ (Pakistan) నుంచి వస్తున్నాయంటూ వీడియోలను రాజాసింగ్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇక తనను బెదిరించిన వ్యక్తులకు షాక్ ఇచ్చారు రాజాసింగ్. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తికి సీఎం రేవంత్ నంబర్ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. తనకు ఎన్ని నంబర్లు ఉన్నాయని బెదిరింపు కాల్స్ చేసిన వారు అడిగారని.. ఇంకో నంబర్ ఉందని చెప్పి సీఎం రేవంత్ నంబర్ ఇచ్చానని అన్నారు. ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పినా.. పోలీసులు పట్టించుకోవడం లేదని.. అందుకే సీఎం నంబర్ ఇచ్చానని అన్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా.. లేదా అనేది చూడాలన్నారు.
తనకు కంటిన్యూయస్ గా బెదిరింపు కాల్స్ వచ్చాయని.. పాలస్తీనాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోందని రాజాసింగ్ వెల్లడించారు. ధర్మం కోసం పనిచేస్తే.. తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. తన ఫ్యామిలీని కూడా చంపేస్తామని బెదిరించారన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో కాల్స్ వచ్చాయి.. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.. ఇప్పుడు సీఎంగా రేవంత్ ఉన్నాడు.. ఇప్పుడైనా వీటిపై చర్యలు తీసుకుంటారో లేదో అని సీఎం నంబర్ ఇచ్చానన్నారు.