జానీ మాస్టర్ కు బెయిల్ వచ్చేనా…?

జూనియర్ డాన్స్ మాస్టర్ ను వేధించిన కేసులో జానీ మాస్టర్ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా దానిపై నేడు తీర్పు వెలువడనుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 14, 2024 | 12:55 PMLast Updated on: Oct 14, 2024 | 12:55 PM

Court Judgment On Jony Master Bail Pitesion

జూనియర్ డాన్స్ మాస్టర్ ను వేధించిన కేసులో జానీ మాస్టర్ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా దానిపై నేడు తీర్పు వెలువడనుంది. లైంగిక ఆరోపణల కేసులో జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు వెల్లడించునుంది రంగారెడ్డి కోర్టు. ఇప్పటికే ఈ కేసుపై వాదనలు ముగిసాయి.

నేషనల్ అవార్డు కోసం గతంలో ఐదు రోజులపాటు మధ్యంతర బెయిల్ ను న్యాయస్థానం మంజూరు చేసింది. అవార్డును తాత్కాలికంగా నిలిపివేయడంతో బెయిల్ ను జానీ మాస్టర్ వాపస్ చేసాడు. బెయిల్ పై మధ్యాహ్నం తర్వాత తీర్పు వెల్లడించనుంది న్యాయస్థానం. ఇక ఈ కేసులో బాదితురాలిపై జానీ మాస్టర్ బంధువు మరో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.