నాగార్జున కక్కుర్తి ఎందుకు, డైలాగ్ లు ఆపు: సిపిఐ నారాయణ సెటైర్ లు

గత నెల రోజుల హైదరాబాద్ లో అక్రమ కట్టడాల విషయంలో హైడ్రా అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ ను కబ్జా ముప్పు నుంచి విడిపించి వరద ముప్పు నుంచి కాపాడే విధంగా అడుగులు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 25, 2024 | 04:09 PMLast Updated on: Aug 25, 2024 | 4:09 PM

Cpi Narayana Comments On Nagarjuna

గత నెల రోజుల హైదరాబాద్ లో అక్రమ కట్టడాల విషయంలో హైడ్రా అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ ను కబ్జా ముప్పు నుంచి విడిపించి వరద ముప్పు నుంచి కాపాడే విధంగా అడుగులు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రముఖ నటులు ఇలా ఎవరూ అనేది లేకుండా అక్రమ కట్టడాల విషయంలో చాలా సీరియస్ గా ఫోకస్ పెడుతోంది. హైడ్రా దెబ్బకు హైదరాబాద్ లో అద్దెకు దిగాలన్నా కూడా జనాలు భయపడే పరిస్థితి ఏర్పడింది. త్వరలోనే మరిన్ని కీలక భవనాలను కూల్చే దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇక తాజాగా సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు కూల్చివేయడం పట్ల… సిపిఐ అగ్ర నేత నారాయణ సంచలన కామెంట్స్ చేసారు. కూల్చివేసిన ప్రాంతాన్ని తన పార్టీ నేతలతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాగార్జునపై సిపిఐ నారాయణ సంచలన కామెంట్స్ చేసారు. నాగార్జున సినీ నటుడే కావచ్చు కాని కక్కుర్తి ఎందుకు…? బుకాయింపు మాటలు వద్దు అన్నారు. సినిమా డైలాగ్ లు కొట్టడం కాదు, వాస్తవంలోకి రావాలని సూచించారు.

అక్రమంగా ఉంటే నేనే కూలుస్తా అని నాగార్జున సినిమా డైలాగ్స్ కొడుతున్నాడు అని మండిపడ్డారు. ఇన్నాళ్ళు అనుభవించిన దానికి నాగార్జున పరిహారం కట్టాలి అని డిమాండ్ చేసారు. ఎన్ కన్వెన్షన్ కూల్చి మంచి పని చేసారు అన్నారు. మల్లారెడ్డి, పల్లా పతివ్రత మాటలు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బుసలు కొట్టింది అన్నారు. అరగంట వాన పడితే ట్రాఫిక్ ఆగిపోతుంది, చెరువులు, నాళాలు అన్నీ కబ్జా చేసారు అని, ఇళ్ళల్లోకి నీరు వస్తున్నాయని నారాయణ మండిపడ్డారు. సిఎం రేవంత్ పులి మీద స్వారీ చేస్తున్నారు, ఇది ఇలాగే కొనసాగించాలి అని కోరారు నారాయణ. అక్రమ కట్టడాలను కూల్చడం మంచిదే… చెరువులను కాపాడాల్సి ఉంటుంది అని అభిప్రాయపడ్డారు. మజ్లీస్ పార్టీ నేతల భవనాలను వదిలిపెట్టవద్దని, హైదరాబాద్ ని ఎక్కువ ఆక్రమించింది వాళ్ళే అన్నారు నారాయణ.