Credit Card : క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. ఈ కొత్త రూల్ తెలుసా.. అలర్ట్..
క్రెడిట్‌కార్డు అనేది ఇప్పుడు ప్రతీ ఒక్కరి నిత్యజీవితంలో భాగమైపోయింది. మంథ్ ఎండ్ వచ్చిందంటే చాలు.. చాలామందికి క్రెడిట్ కార్డే ఆప్షన్‌గా మారింది.

Credit card is now a part of everyone's daily life. It is enough that the month end has come.. credit card has become an option for many.
క్రెడిట్‌కార్డు అనేది ఇప్పుడు ప్రతీ ఒక్కరి నిత్యజీవితంలో భాగమైపోయింది. మంథ్ ఎండ్ వచ్చిందంటే చాలు.. చాలామందికి క్రెడిట్ కార్డే ఆప్షన్‌గా మారింది. ఇక అకస్మాత్త్తు అవసరాల్లోనూ క్రెడిట్ కార్డు.. మంచి ఫ్రెండ్‌లా ఉపయోగపడుతోంది.
షాపింగ్, బిల్ పేమెంట్… ఇలాంటి వాటికి చాలామంది క్రెడిట్ కార్డే వాడుతున్నారు. డెబిట్ కార్డులను మించి క్రెడిట్ కార్డుల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయ్. కార్డు వాడేయడం ఆ తర్వాత.. థర్డ్ పార్టీ యాప్ నుంచి బిల్లు పేమెంట్ చేస్తూ.. క్యాష్‌బ్యాక్, ఓచర్‌లతో మరింత షాపింగ్ చేస్తున్నారు. ఐతే ఇప్పుడు క్రెడిట్‌కార్డు రూల్స్ పూర్తిగా మారిపోయాయ్. క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపుల కోసం.. చాలామంది ఫోన్‌పే, క్రెడ్, చెక్, ఫోన్‌పే, పేటీఎంలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగిస్తున్నారు. రివార్డు పాయింట్లు వస్తాయని.. బిల్లు చెల్లింపులన్నీ ఒక చోట ఉంటాయని ఎక్కువ మంది వీటిని వినియోగిస్తుంటారు. ఒకవేళ మీరు కూడా థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తుంటే ఈ అలర్ట్ మీ కోసమే.. జూలై 1 నుంచి థర్డ్ పార్టీ యాప్‌ల నుంచి క్రెడిట్‌కార్డు బిల్లులు చెల్లించడం సాధ్యం కాదు.
దీనికి సంబంధించి ఆర్బీఐ కొత్త నిబంధన తీసుకువచ్చింది. క్రెడిట్ కార్డుల బిల్లు పేమెంట్లు అన్నీ BBPS అంటే.. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారానే జరగాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. జులై 1 ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చింది. క్రెడిట్ కార్డుల బిల్లు చెల్లింపుల్లో సెక్యూరిటీ, ట్రాకింగ్ పెంచేందుకు ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. క్రెడిట్ కార్డులు జారీ చేసే బ్యాంకులన్నీ.. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా BBPSలో చేసిన బ్యాంకుల కార్డులను మాత్రమే థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా బిల్లు పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం 34 బ్యాంకులు క్రెడిట్ కార్డులు జారీ చేస్తుండగా.. ఇప్పటివరకు SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్, ఫెడరల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు మాత్రమే BBPS సిస్టమ్‌ను యాక్టివేట్ చేసుకున్నాయ్. ఈ బ్యాంక్ కార్డులు వినియోగిస్తున్న వారికి ఎలాంటి సమస్య లేదు. థర్డ్ పార్టీ యాప్ ద్వారా.. పేమెంట్ చేయొచ్చు.
ఈ 8 కాకుండా.. మిగతా బ్యాంకుల క్రెడిట్ కార్డులు వాడే వాళ్లు మాత్రం.. మొబైల్ బ్యాంకింగ్, నెట్‌బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 26 బ్యాంకులు BBPSలో యాక్టివేట్ కాకపోవడంతో.. ఫోన్ పే, క్రెడ్, చెక్‌లాంటి యాప్స్.. కంపెనీలు ఆయా బ్యాంకుల కస్టమర్ల క్రెడిట్ కార్డుల బిల్లులను ప్రాసెస్ చేయడం కుదరదు. దీనివల్ల ఆయా యాప్స్‌లో క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించలేరు. ఐతే దీనికి సంబంధంచి గడువు పొడిగించాలని బ్యాంకింగ్ వర్గాలు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కోరుతున్నాయ్. ఐతే ఆర్‌బీఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.