Olympic Games: క్రికెట్ ప్రేమికులకు శుభవార్త.. ఒలంపిక్స్ లో స్థానం చోటు చేసుకోనున్న క్రికెట్
క్రికెట్ పేరు చెబితే తెలియని వారు ఎవరూ ఉండరు. విశ్లేషకులకున్నంత పరిజ్ఞానం లేకపోయినా కొంతో గొప్పో ప్రాధమిక అవగాహన ఉంటుంది. అలాంటి క్రికెట్ ను ఒలంపిక్స్ లో చేర్చేందుకు ప్రతిపాదనలు సిద్దమయ్యాయి.

Cricket has earned a place in the Olympic Games hosted by France
క్రికెట్ పేరు చెబితే తెలియని వారు ఎవరూ ఉండరు. విశ్లేషకులకున్నంత పరిజ్ఞానం లేకపోయినా కొంతో గొప్పో ప్రాధమిక అవగాహన ఉంటుంది. అలాంటి క్రికెట్ ను ఒలంపిక్స్ లో చేర్చేందుకు ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. ఇక ఓటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇది కూడా ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యులు ఆమోదం లాంఛన ప్రాయంగా కనిపిస్తున్నందున దాదాపు ఈ క్రీడ 2028 ఒలంపిక్స్ లో చోటు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
1900 సంవత్సరంలో చివరి సారిగా క్రికెట్ ఆటకు పారిస్ వేదిక అయింది. ఆతరువాత దీనిని ఒలంపిక్స్ జాబితా నుంచి తొలగించారు. అయితే ఈ సారి ఫ్రాన్స్ వేదికగా జరిగే 2028 ఒలంపిక్స్ లో కొన్ని క్రీడలు జాబితా నుంచి తొలగించనున్నారు. అందులో బాక్సింగ్ ముందు వరుసలో ఉంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలంపిక్ కమిటి అంతర్జాతీయ బాక్సింగ్ సమైఖ్యకు తెలిపింది. దీంతో ఈ క్రీడకు వేటు తప్పనిసరి అయింది. ఇదిలా ఉంటే కొత్తగా కొన్ని ఆటలు ఇందులో చోటు సంపాదించుకున్నాయి. కాంపౌండ్ ఆర్చరీ, బేస్ బాల్, సాఫ్ట్ పుల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రోసి, స్క్వాష్ ఆటలతో పాటూ క్రికెట్ కూడా చోటు దక్కనుంది. వీటికి ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుల ఆమోదం పొందింది. దీనిని ఒలంపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ ఆమోదముద్ర వేశారు. ఇక కేవలం నామమాత్రంగా జరిపే ఓటింగ్ ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. అధ్యక్షుడే ఆమోద ముద్ర వేసిన తరువాత కమిటీ సభ్యులు కేవలం సూచన ప్రాయంగా ఓటింగ్ నిర్వహిస్తారు. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం.
ఈ ఓటింగ్ ప్రక్రియ ముంబైలో ఆదివారం జరుగనుంది. ఐఓసీ సెషన్స్ లో దీనికి మొజారిటీ సంఖ్యలో ఓటింగ్ నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ మంచి ఆదరణ పొందుతున్న తరుణంలో ఒలంపిక్స్ లో కూడా ఈ క్రీడలు చేర్చడంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న వన్డే సరైన ఫలితాలు సాధించిన తరుణంలో టీ 20 పేరుతో మరో సరికొత్త ప్రయోగాన్ని తీసుకొచ్చారు. తాజాగా ఒలంపిక్స్ లో కూడా ఈ ఆటను చేర్చి మరిన్ని ప్రయోగాలలో విజయాలు సాధించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ సారి ఫ్రాన్స్ వేదికగా జరిగే ఒలంపిక్స్ లో క్రికెట్ టీ 20 చోటు కల్పించుకుంటుందని కచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఏఏ దేశాలు ఎంపిక అవుతాయి. ఎవరెవరు ఆటలో పాల్గొంటారు అనే వివరాలు తెలియాలంటే మరి కొన్ని నెలలు వేచి ఉండక తప్పదు.
T.V.SRIKAR