Aydhya Ram Mandir : అయోధ్యలో భక్తుల రద్దీ… 11 రోజుల్లో 25 లక్షల మంది…!
అయోధ్య (Ayodhya Ram Mandir) లో బాలక్ రామ్ (Bala Rama) విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగినప్పటి నుంచీ భక్తుల పోటెత్తుతున్నారు. రోజు రోజుకీ భక్తుల రద్దీ పెరిగిపోతోంది. బాల రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1 వరకు దాదాపు 25 లక్షల మంది భక్తులు అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. 11 కోట్ల రూపాయల దాకా హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

బాలక్ రాముడిని దర్శించుకోడానికి వెళ్ళే మార్గంలో మొత్తం 4 హుండీలను ట్రస్ట్ అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో గత 11 రోజుల్లో 8 కోట్ల రూపాయల నగదు వచ్చింది. ఇంకా మూడున్నర కోట్లు చెక్కుల రూపంలో వచ్చాయి. వీటిల్లో ఆన్లైన్ విరాళాలు కూడా ఉన్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. బ్యాంక్ సిబ్బంది, ఆలయ ట్రస్ట్ ఉద్యోగులతో కలసి మొత్తం 14 మంది ఈ డబ్బులను లెక్కపెట్టారు. అయోధ్య రాముడికి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించేటప్పుడు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సీసీటీవీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపు జరిగినట్టు ఆలయ ట్రస్టు ఆఫీస్ వర్గాలు తెలిపాయి.
బాలక్ రామ్ (Bala Rama) మందిరానికి వస్తున్న భక్తుల సంఖ్య పెరగడంతో రద్దీని దృష్టిలో పెట్టుకొని స్వామి వారి దర్శన వేళలు పెంచారు. గతంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరింటి దాకే దర్శనాలు ఉండేవి. కానీ ఇప్పుడు ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి పదింటి దాకా భక్తులు ఆలయాన్ని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యకు వెళ్ళడానికి దేశంలోని 8 నగరాల నుంచి స్పైస్ జెట్ డైరెక్ట్ ఫ్లయిట్ సేవలు ప్రారంభించింది. దర్భంగా, అహ్మదాబాద్, చెన్నై, జయపుర, పట్నా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి ఈ విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చారు. ఇంకా చాలా నగరాల నుంచి విమానం సౌకర్యం కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు.