fish medicine : కిక్కిరిసిన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్.. చేప మందు ప్రసాదం కోసం బారులు తీరిన రోగులు
ఇవాళ ఉదయం 9గంటలకు ప్రారంభమైన చేప మందు పంపిణీ కార్యక్రమం.. 24గంటలపాటు సాగనుంది. ఇందుకోసం ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. 1,60,000 చేప పిల్లలను సిద్ధం చేశారు. చేప ప్రసాద పంపిణీకి 34 స్ఠాళ్లను ఏర్పాటు చేశారు. బందోబస్తులో 1200 మంది పోలీసులు పాల్గొన్నారు. చేప ప్రసాదం కోసం TGRTC 130 ప్రత్యేక బస్సులను ప్రధాన బస్టాండ్లు అయిన జూబ్లీహిల్స్, ఎంజీబీఎస్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు ఈ బస్సులు నడపనున్నారు.
నేడే మృగశిర కార్తె.. ఈ పేరు వినగానే అందరికీ ముందుగా చేపలు గుర్తుకు వస్తాయి. ఆదే అస్తమా ఉన్నవాళలకు చేప మందు ప్రసాధం గుర్తుకు వస్తాయి. ఉవాళ ఉదయం నుంచి హైదరాబాద్ లోని నాంపల్లి లో ఈ చేప మందు ప్రసాదం పంపిణీ కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి మంత్రిపొన్నం ప్రభాకర్ చేపమందుపంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మెట్టు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవాళ ఉదయం 9గంటలకు ప్రారంభమైన చేప మందు పంపిణీ కార్యక్రమం.. 24గంటలపాటు సాగనుంది. ఇందుకోసం ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. 1,60,000 చేప పిల్లలను సిద్ధం చేశారు. చేప ప్రసాద పంపిణీకి 34 స్ఠాళ్లను ఏర్పాటు చేశారు. బందోబస్తులో 1200 మంది పోలీసులు పాల్గొన్నారు. చేప ప్రసాదం కోసం TGRTC 130 ప్రత్యేక బస్సులను ప్రధాన బస్టాండ్లు అయిన జూబ్లీహిల్స్, ఎంజీబీఎస్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు ఈ బస్సులు నడపనున్నారు.
చేప ప్రసాదం ఎందుకు వేసుకుంటారు..?
ఈ చేప మందు ప్రసాదం.. ఆస్తమా, శ్వాస సంబంధిత వ్యాధిగ్రస్తులు వేసుకుంటారు. ఈ చేప మందు ప్రసాదంతో ఆ సమస్యలు అన్ని కూడా శాస్వత్తంగా దూరమైవుతాయి. దీంతో ఈ చేప ప్రసాదం వేసుకునేందుకు.. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాలు.. అమెరికా, కెనడా, ఇటలీ, జర్మనీ, దేశాల నుంచి కూడా ప్రజలు భారీగా తరలి వస్తుంటారు. ఇక బ్రహ్మనులకు అయితే ఈ చేప మందు ప్రసాధం ను బెల్లంలో గానీ నేరుగా గానీ ఇస్తుంటారు. 150 సంవత్సరాలుగా బత్తిని కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.