Telugudesam: టీడీపీ నేతలందరికీ సీఆర్పీసీ నోటీసులు.. ఏపీలో కొనసాగుతున్న ఉత్కంఠ..
ఏపీలో తెలుగుదేశం పార్టీ నాయకులను కట్టడి చేస్తున్న పోలీసులు.

CRPC notice to telugudesam leaders in Andhra pradesh
చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో హైటెన్షన్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు పోలీసులు. రాష్ట్రంలో పరిస్థితిని వివరించేందుకు గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు టీడీపీ నేతలు. కానీ చివరి నిమిషమంలో అపాయింట్‌మెంట్‌ను రద్దు చేశారు గవర్నర్. ఏపీలో టీడీపీ కీలక నేతలందరికీ సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు పోలీసులు. దీంతో ఇప్పుడు ఏపీలో వాతావరణం హాట్ హాట్‌గా మారింది. మరోపక్క నిన్న చంద్రబాబును కలిసేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్‌ను మార్గ మధ్యలోనే అడ్డుకున్నారు.
నిజానికి నిన్న సాయంత్రమే ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ విజయవాడకు రావాల్సి ఉంది. కానీ లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే సమస్య ఉండటంతో పోలీసులు పవన్ ను అడ్డుకున్నారు. మధ్యలోనే అరెస్ట్ చేసిన హైదరాబాద్‌కు తరలించారు. అటు ఏపీలో టీడీపీ నేతలకు మరోసారి సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు కీలక నేతలందరినీ కూడా ఎక్కడికక్కడ హౌజ్ అరెస్ట్‌లు చేస్తున్నారు పోలీసులు. రోడ్లపైకి రాకుండా కట్టుదిట్టం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఎలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించకుండా టీడీపీ నేతలను అడ్డుకుంటున్నారు. దీంతో ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది.