ఆడినా,ఆడకున్నా మాతోనే ధోనీ తేల్చేసిన సీఎస్కే సిఈవో
ఐపీఎల్ 18వ సీజన్ లో ధోనీ ఆడడం ఖాయమైంది. ఇటీవల రిటెన్షన్ లో అన్ క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో చెన్నై సూపర్ కింగ్స్ ధోనీని 4 కోట్లకే దక్కించుకుంది.
ఐపీఎల్ 18వ సీజన్ లో ధోనీ ఆడడం ఖాయమైంది. ఇటీవల రిటెన్షన్ లో అన్ క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో చెన్నై సూపర్ కింగ్స్ ధోనీని 4 కోట్లకే దక్కించుకుంది. తాజాగా ధోనీపై చెన్నై సీఈవో విశ్వనాథన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ ఆడినా, ఆడకున్నా ఎప్పటికీ చెన్నై జట్టుతోనే ఉంటాడని వ్యాఖ్యానించాడు. అతను ఆడినంతకాలంగా జట్టులో ఉంటాడని స్పష్టం చేశాడు. సీఎస్కేతో ధోనీ అనుబంధం ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఆటగాడిగా తప్పుకున్నా చెన్నైకి మెంటార్ గానే ధోనీ వ్యవహరిస్తాడనేది ఫ్యాన్స్ మాట. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ తో లైఫ్ టీమ్ ధోనీ రిలేషన్ కొనసాగుతూనే ఉంటుందని ఆ ఫ్రాంచైజీ సీఈవో మాటలతో తేలిపోయింది.