స్టార్ బ్యాటర్ల జోరుకు బ్రేక్, భారత్ కు విలన్ లా కమ్మిన్స్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన పేసర్లతో పోలిస్తే కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ మన జట్టుకు విలన్ లా మారాడు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా వికెట్లు తీస్తూ ఆసీస్ కు బ్రేక్ త్రూ ఇస్తున్నాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియా బౌన్స్ బ్యాక్ అవ్వడంలో కెప్టెన్ కమ్మిన్స్ దే కీలకపాత్ర.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన పేసర్లతో పోలిస్తే కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ మన జట్టుకు విలన్ లా మారాడు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా వికెట్లు తీస్తూ ఆసీస్ కు బ్రేక్ త్రూ ఇస్తున్నాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియా బౌన్స్ బ్యాక్ అవ్వడంలో కెప్టెన్ కమ్మిన్స్ దే కీలకపాత్ర. అడిలైడ్ టెస్టులో పింక్ బాల్ తో కమ్మిన్స్ అదరగొట్టేశాడు. కీలక భీకర బంతులతో టీమిండియాను వరుసపెట్టి పెవిలియన్ కు పంపించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 14 ఓవర్లలో 57 పరుగులిచ్చి ఐదు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కూడా కమిన్స్ 2 వికెట్లు తీశాడు. ఈ విధంగా మొత్తం 7 వికెట్లు పడగొట్టిన కమిన్స్ ఆస్ట్రేలియా విజయంలో కెప్టెన్ పాత్ర పోషించాడు.
అడిలైడ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి కమిన్స్ తన పేరు మీద ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. భారత్‌పై రెడ్ అండ్ వైట్ బాల్స్ తో 5 వికెట్లు తీసిన కమిన్స్ పింక్ బంతితోనూ భారత్ పై ఐదు వికెట్లు తీశాడు. అంటే మూడు రకాల బంతుల సిరీస్ లో కమిన్స్ ఐదు వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఈ సిరీస్ లో కమిన్స్ కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతున్నాడు. కమిన్స్ టెస్టు కెరీర్‌ను పరిశీలిస్తే.. 64 టెస్టుల్లో 3 హాఫ్ సెంచరీలతో 1312 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 279 వికెట్లు తీశాడు. ఈ సమయంలో ఒక ఇన్నింగ్స్‌లో 13 సార్లు 5 వికెట్లు మరియు రెండుసార్లు ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. 23 పరుగులకు 6 వికెట్లు పడగొట్టడం అతని కెరీర్ బెస్ట్ గా చెప్పొచ్చు.
సహజంగానే తమ పేస్ పిచ్ లపై ఆసీస్ పేసర్లు చెలరేగిపోతుంటారు. కానీ భిన్న పరిస్థితుల్లోనూ కమ్మిన్స్ సత్తా చాటుతున్నాడు. ఇదే పిచ్ పై భారత పేసర్లు మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయారు. ఇప్పుడు మిగిలిన మూడు టెస్టుల్లోనూ భారత్ బ్యాటర్లకు కమ్మిన్స్ బౌలింగే ప్రధాన సవాల్ కానుంది. స్టార్క్, బొలాండ్ తో పోలిస్తే తన కెప్టెన్ రోల్ తో పాటు ప్రధాన పేసర్ గానూ అదరగొడుతున్నాడు.