Trivikram Srinivas : వామ్మో… త్రివిక్రమ్ పెద్ద స్కెచ్ వేశారుగా
ప్రస్తుతం టాలీవుడ్ లో పవర్ ఫుల్ డైలాగ్స్ రాసి మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ టాప్లో ఉంటారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో పవర్ ఫుల్ డైలాగ్స్ రాసి మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ టాప్లో ఉంటారు. కానీ ఈ మధ్య వస్తున్న సినిమాల్లో డైలాగ్స్ సహా పలు నిర్ణయాల విషయంలో త్రివిక్రమ్ పని అయిపోయిందని పుకార్లు వస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ ఒక్క హిట్టు సినిమా తీస్తే తర్వాత రెండు మూడు ప్లాప్ చిత్రాలు ఇస్తున్నారని పలువురు కామెంట్లు కూడా చేస్తున్నారు. పైగా గుంటూరు కారం తర్వాత మరో ప్రాజెక్ట్ గురించి అప్ డేట్ ఇవ్వకుండా….సైలెంట్ గా ఉండటం హాట్ టాపిక్ గామారింది,
గుంటూరు కారం అలా అయిపోగానే… త్రివిక్రమ్.. అల్లు అర్జున్ కాంబో సెట్స్ పైకి వెళ్తుందని అందరు భావించారు. కట్ చేస్తే… బన్నీ పుష్ప2 తో నే జర్నీ కొనసాగుతుండగా…. గురూజీ మాత్రం సైలెంట్ అయిపోయాడు. ఈ సైలెంట్ వెనక పెద్ద కథ ఉన్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కారణం గురూజీ మరో ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టలేకపోతున్నాడట. పవన్ కల్యాణ్ కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ అయిన తర్వాతే నెక్ట్స్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాలనుకుంటున్నాడట త్రివిక్రమ్
పవన్ కల్యాణ్ ప్రజెంట్ రాజకీయాల్లో బిజీగా మారాడు. దీంతో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలకు బ్రేక్ పడింది. అయితే ఈ మూడు సినిమాలు కంప్లీట్ చేయాలనుకుంటున్నాడట పవన్. అయితే ఈ విషయం గురించి రీసెంట్ గా త్రివిక్రమ్ పవన్ కలిసి చర్చించినట్లు టాక్ నడుస్తోంది. అయితే త్వరలోనే పవన్ డేట్స్ ఇవ్వనున్నాడని… పవన్ సినిమాలు అలా కంప్లీట్ కాగానే… గురూజీ అల్లుఅర్జున్ సినిమాను పట్టాలెక్కించాలనుకుంటున్నాడట. బన్నీతో తీయబోయే సినిమా కల్కికి మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఒక కాన్సెప్ట్ లాక్ అయిందని, ఈ సినిమా కి ప్రీ ప్రోడుక్షనే దాదాపు ఏడాదిన్నర పడుతుందని, సినిమాకి అయ్యే ఖర్చు సమకూర్చడానికి చాలా సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోనే ఇదొక కాస్ట్లీ సినిమాగా ఉంటుందన్న విషయం తెలిసి అల్లు ఆర్మీ ఖుషి అవుతోంది.