Taj Mahal Palace, Cyber Attack : తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ పై సైబర్ దాడి.. ప్రమాదంలో 15 లక్షల మంది డేటా..!
భారతదేశంలోని ప్రముఖ లగ్జరీ హోటల్ తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్. గత కొన్ని సంవత్సరాలుగా ఈ హోటల్ పై దాడులు జరుగుతునే ఉన్నాయి. చరిత్రలో ఎప్పుడూ చూడని.. భారీ బాంబు పేలుడు ఈ హోటల్ జరిగిన విషయం మీకు తెలిసిందే.. చాలా సార్లు పాకిస్థాన్ నుంచి బాంబు బెదిరింపులు ఈ హోటల్ కు వస్తునే ఉన్నాయి. తాజాగా మరో బెదిరింపు కూడా వచ్చింది ఈ హోటల్ కు.. కానీ అది బాంబు బెదిరింపు అయితే కాదు.. సైబర్ బెదిరింపులు.
భారతదేశంలోని ప్రముఖ లగ్జరీ హోటల్ తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్. గత కొన్ని సంవత్సరాలుగా ఈ హోటల్ పై దాడులు జరుగుతునే ఉన్నాయి. చరిత్రలో ఎప్పుడూ చూడని.. భారీ బాంబు పేలుడు ఈ హోటల్ జరిగిన విషయం మీకు తెలిసిందే.. చాలా సార్లు పాకిస్థాన్ నుంచి బాంబు బెదిరింపులు ఈ హోటల్ కు వస్తునే ఉన్నాయి. తాజాగా మరో బెదిరింపు కూడా వచ్చింది ఈ హోటల్ కు.. కానీ అది బాంబు బెదిరింపు అయితే కాదు.. సైబర్ బెదిరింపులు.
ఇప్పుడు కాలం మారింది భౌతిక దాడులకు కన్నా.. సైబర్ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. టెక్నాలజీతో సైబర్ మోసగాలు ప్రపంచ మొత్తం వ్యాప్తి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. తాజాగా టాటా గ్రూప్కు చెందిన తాజ్ హోటల్ గ్రూప్ లో నవంబర్ 5న సైబర్ దాడి జరిగింది. తాజ్ హోటల్ కు చెందిన దాదాపు 15 లక్షల మంది వినియోగదారుల డేటా తమ వద్ద ఉందని హ్యాకర్లు
పేర్కొన్నట్లు ముంబై మీడియా కథనాలను ప్రసారం చేసింది.
సైబర్ నేరగాళ్లు తాజ్ హోటల్ సంబంధించిన వినియోగదారుల డేటాను తమ వద్దే ఉందని.. ఈ సమాచారన్ని ఎవరికి ఎవరికి ఇవ్లేదని స్పష్టం చేశారు. కాగా అతను ఈ డేటాను తిరిగి ఇవ్వడానికి 5000 డాలర్లు, మూడు షరతులు కూడా ఇచ్చాడు తాజ్ హోటల్ సిబ్బందికి. అయితే వినియోగదారులు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని తాజ్ హోటల్ గ్రూప్ తెలిపింది. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని, కస్టమర్ డేటా సురక్షితంగా ఉందని వివరించింది.
కస్టమర్ డేటాకు DNA కుక్కీలుగా నామకరణం : హ్యాకర్లు
తాజ్ హోటల్ కస్టమర్స్ నుంచి చోరీ చేసిన డేటాను హ్యాకర్లు DNA కుక్కీలు గా నామకరణం చేశారు. కాగా హ్యాకర్లు 5,000 వేల డాలర్లు ( 4 లక్షలు ) డిమాండ్ చేశారు. డేటాను తిరిగి ఇవ్వడానికి మూడు షరతులు విధించారు.. ముందుగా తమతో చర్చల కోసం ఉన్నత స్థాయి వ్యక్తిని మధ్యవర్తిగా
తీసుకురావాలని కోరారు. అలాగే, డేటాను ముక్కలుగా ఇవ్వకూడదని అతను రెండవ డిమాండ్ మూడవ షరతులో అతను మా నుండి డేటా నమూనాలను అడగకూడదని చెప్పాడు. ఈ హ్యాకర్లు నవంబర్ 5న 1000 కాలమ్ ఎంట్రీలతో డేటాను లీక్ చేశారు.
ప్రమాదంలో 15 లక్షల మంది డేటా..!
ఈ భారీ సైబర్ దాడి వల్ల దాదాపు 15 లక్షల మంది కస్టమర్లు జీవితాలు ప్రభావితమయ్యారని మీడియా కథనాలలో పేర్కొంది. వారి వ్యక్తిగత నంబర్, ఇంటి చిరునామా, మెంబర్షిప్ ఐడీ వంటి అనేక సమాచారం హ్యాకర్లకు దొగంలించారు. హ్యాకర్లు తమ వద్ద 2014 నుంచి 2020 వరకు డేటా ఉందని బెదిరింపులకు పాల్పడుతున్నారు.
IHCL ఏం చెప్పింది..?
ఈ భారీ సైబర్ దాడిపై IHCL స్పందించింది. ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్సిఎల్) ప్రతినిధి మాట్లాడుతూ హ్యాకర్ల క్లెయిమ్ గురించి తెలిసిందని చెప్పింది. కంపెనీ తన కస్టమర్ల డేటా గురించి ఆందోళన చెందుతోంది. కాబట్టి ఈ దావాను పరిశీలిస్తున్నామని తెలిపింది. ఈ విషయాన్ని సైబర్ సెక్యూరిటీ ఎజెన్సీలు, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In)కి కూడా తెలియజేసామని చెప్పింది అంతేకాకుండా, సంస్థ భద్రతా వ్యవస్థను కూడా దర్యాప్తు చేస్తున్నారు.