PANJAGUTTA PS: పోలీస్ శాఖలో సంచలనం.. పంజాగుట్ట పోలీస్ స్టేషనా..? బీఆర్ఎస్ బ్రాంచ్ ఆఫీసా..?
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి 86మందిని బదిలీ చేయడం హాట్ టాపిక్ అయింది. ఇంత పెద్ద సంఖ్యలో బదిలీ చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి. ఎందుకింత పెద్ద నిర్ణయం తీసుకున్నారు అంటే.. బోధన్ మాజీ MLA షకిల్ కొడుకు హిట్ అండ్ రన్ కేసు వ్యవహారమే మొదటి కారణం.
PANJAGUTTA PS: హైదరాబాద్ CP కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణ పోలీస్ శాఖ హిస్టరీలోనే మునుపెన్నడూ లేనివిధంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని మార్చేశారు. ఒకరు.. ఇద్దరు.. కాదు. ఏకంగా 86 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేశారు సీపీ శ్రీనివాస్ రెడ్డి. ఇన్స్‌పెక్టర్ స్థాయి నుంచి హోంగార్డుల దాకా అందరినీ ARకి అటాచ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తీసుకున్న బదిలీ నిర్ణయం పోలీసుల్లో పెద్ద సంచలనంగా మారింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి 86మందిని బదిలీ చేయడం హాట్ టాపిక్ అయింది. ఇంత పెద్ద సంఖ్యలో బదిలీ చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి.
ఎందుకింత పెద్ద నిర్ణయం తీసుకున్నారు అంటే.. బోధన్ మాజీ MLA షకిల్ కొడుకు హిట్ అండ్ రన్ కేసు వ్యవహారమే మొదటి కారణం. సీఎం క్యాంపాఫీస్ బారికేడ్స్ ఢీకొట్టిన షకీల్ కొడుకు సొహైల్‌ను ఆ కేసు నుంచి తప్పించారు పోలీసులు. వేరే అమాయకుడిని కేసులో ఇరికించారు. ఈ కేసులో పంజాగుట్ట పీఎస్ ఇన్స్‌పెక్టర్ దుర్గారావు సస్పెండ్ అయ్యారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. వాళ్ళు చెప్పిందల్లా నడిచింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా పోలీస్ స్టేషన్‌లో జరిగే ప్రతి వ్యవహారం.. ఇతర కీలక విషయాలు బయటకి పొక్కడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీపీ శ్రీనివాస్ రెడ్డి. ఇక్కడి ఇన్ఫర్మేషన్‌ను గత ప్రభుత్వ పెద్దలకు చేరవేస్తున్నట్టు తేలడంతో అందర్నీ మూకుమ్మడిగా బదిలీ చేశారు సీపీ. హైదరాబాద్ సిటీలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి సిబ్బందిని వెంటనే పంజాగుట్ట స్టేషన్‌కు బదిలీ చేశారు. BRS బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కేసులో ఇన్స్‌పెక్టర్ దుర్గారావుని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే సస్పెండ్ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న దుర్గారావుపై కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ సమాచారాన్ని కూడా ఇదే స్టేషన్ నుంచి ఎప్పటికప్పుడు లీక్ చేస్తున్నటుట సీపీ గుర్తించారు.
అందుకే పంజాగుట్ట పీఎస్ సిబ్బంది అందర్నీ ఎంక్వైరీ చేసి.. సీఎం సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఉంటున్న ప్రజాభవన్ పంజాగుట్ట పీఎస్ పరిధిలోకే వస్తుంది. ప్రజాభవన్‌కు వచ్చే బాధితుల వివరాలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ లీడర్లకు చేరవేస్తున్నారన్న ఆరోపణలు కూడా పోలీసులుపై ఉన్నాయి. హైదరాబాద్ సిటీ మధ్యలో ఉండే పంజాగుట్ట పోలీస్ స్టేషన్.. సిటీ లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కీలకమైన స్టేషన్. గతంలో ఈ స్టేషన్ దేశంలోనే బెస్టాఫ్ త్రీలో ఒకటిగా నిలిచి అరుదైన గుర్తింపు పొందింది. అంతటి మంచి చరిత్ర ఉన్న పీఎస్‌ను.. అది పంజాగుట్ట పోలీస్ స్టేషనా.. లేక బీఆర్ఎస్ పార్టీ ఆఫీసా.. అన్నట్టుగా తయారు చేసి పోలీస్ శాఖకే మచ్చ తెచ్చారు కొందరు అధికారులు. ఈ ఆరోపణలనుంచి బయటపడేందుకే.. 86 మందిని బదిలీ చేశారు సీపీ. దేశ చరిత్రలోనే ఒకే ఆర్డర్ కాపీతో స్టేషన్ మొత్తం పోలీస్ స్టేషన్ సిబ్బందిని బదిలీ చేసి సంచలనం సృష్టించారు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.