Police Mobile Hacking: హాకర్ గా మారిన ఐటీ ఉద్యోగి.. సైబర్ క్రైం పోలీసులకే చమటలు పట్టించిన వైనం
ప్రస్తుత కాలంలో ఐటీ పరిశ్రమ పతనమౌతుంటే.. సాంకేతికత మాత్రం తెగ అభివృద్ది చెందుతోంది. తాజాగా ఒక పోలీసు అధికారి ఫోన్ హాక్ చేసి ముచ్చమటలు పట్టించారు ఒక ఐటీ ఉద్యోగి.
ఐటీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు గతంలో ర్యాలీలు పేరిట హైదరాబాద్ వీరంగం సృష్టించారు. దీనికి పర్మిషన్ లేదని కొందరు పోలీసులు ఐటీ ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఒక పోలీసు అధికారి సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో దురుసుగా ప్రవర్తించారని తెలుస్తోంది. అందుకే అతని ఫోన్ నంబర్ సేకరించి తద్వారా ఆయన ఫోన్ హ్యాక్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఒక పోలీసు అధికారి ఫోన్ హాక్ చేయడం అంత సులువైన పని కాదంటున్నారు సైబరాబాద్ పోలీసులు. దీనికి చాలా అంశాలను పరిగిణలోకి తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు. ఎలాంటి సైబర్ దాడులనైనా ఇట్టే పసిగట్టే సాంకేతికత తమ వద్ద ఉందంటూ చెప్తూ ఉంటుంది తెలంగాణ పోలీసు శాఖ. ఈ క్రమంలో ఒక పోలీసు ఉన్నతాధికారి ఫోనే హాకింగ్ కి గురైతే పరిస్థితి ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. పైగా ఆయన వ్యక్తిగత చాటింగ్, ఫోటోలు, వీడియోలు అన్నీ సేకరించి తిరిగి పోలీసు అధికారులకే పంపించాడు. దీంతో పోలీసు శాఖ కంగుతింది. ఈ ఒక్క అధికారి డేటానే కాదు మిగిలిన సిబ్బందికి సంబంధించిన డేటా కూడా బయటపెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నాడు సదరు ఐటీ ఉద్యోగి.
సైబర్ క్రైం నిపుణుల వివరణ..
నేటి సాంకేతికత రోజు రోజుకూ అభివృద్ది చెందుతున్న క్రమంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఒక పోలీసు ఉన్నతాధికారి ఫోన్ హాక్ చేయడం అంటే అంత సులువైన పని కాదంటున్నారు సైబర్ క్రైం నిపుణులు. హాకర్లు ఆ అధికారిపై ఒక అమ్మాయిని ఉసిగొలిపి ఆమెకు ఆకర్షితున్ని చేసి ఈ విధమైన ప్రక్రియకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. అలా ఆయన ఫోన్ తీసుకుని అందులో నుంచి చాటింగ్ చేసి మాల్ వేర్ ను చొప్పించి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం బయటకు పొక్కితే పోలీసు డిపార్ట్మెంట్ పరువ పోతుందని, పైగా ఆయన వ్యవహారమంతా బయటపడే అవకాశం ఉందని మౌనంగా ఉన్నారు. ఒక మాల్ వేర్ ను తన ఫోన్ లోకి పంపించాలంటే హాకర్ల చేతిని తన డివైజ్ ని ఇస్తా తప్ప వేరో రూపంలో చొప్పించలేరని చెబుతున్నారు నిపుణులు. అయితే హాకింగ్ కి పాల్పడిన ఐటీ ఉద్యోగిని గుర్తించినట్లు తెలిపారు పోలీసులు.
T.V.SRIKAR