Cyclone ‘Rumal’ : తీరం దాటిన ‘రెమాల్’ తుఫాను.. వెస్ట్ బెంగాల్ లో రెమలాల్ తుఫాన్ భీభత్సం
ఉత్తర బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన 'రెమాల్' తుఫాను తీరం దాటినట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్ తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్, ఒడిశా మీదుగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య నిన్న (మే 26) రాత్రి 10.30 నుంచి అర్ధరాత్రి 12.30 గంటల మధ్య తీవ్ర తుఫానుగా మారి తీరం దాటింది.
ఉత్తర బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘రెమాల్’ తుఫాను తీరం దాటినట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్ తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్, ఒడిశా మీదుగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య నిన్న (మే 26) రాత్రి 10.30 నుంచి అర్ధరాత్రి 12.30 గంటల మధ్య తీవ్ర తుఫానుగా మారి తీరం దాటింది. అనంతరం ఇది ఈశాన్య దిశలో కదులుతూ క్రమంగా బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. కోల్‌కతా, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, బిధాన్‌నగర్, బీర్బూమ్, నాడియా, బంకురా, తూర్పు బుర్ద్వాన్, తూర్పు మేదినీపూర్ సహా బెంగాల్‌లోని పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది.
నేడు బెంగాల్, బంగ్లాదేశ్ లో గరిష్ఠంగా 135 కి.మీ వేగంతో పెనుగాలులు వీస్తాయని IMD చెబుతోంది. కాగా ఇప్పటికే బెంగాల్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని లక్షమందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను కారణంగా కోల్‌కతా విమానాశ్రయాన్ని 21 గంటల పాటు మూసివేశారు. కొన్ని ప్రాంతాల్లో మెట్రో సేవలను కూడా నిలిపివేశారు అధికారులు… రెమల్ తుఫాన్ ప్రభావంతో బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటకు రాకూడదని హెచ్చిరికలను జారీ చేసింది.