Bhadrachalam Talambralu : భద్రాద్రి సీతారాముల కల్యాణానికి వాడే తలంబ్రాల విశిష్టత తెలుసా..? ఎలా తయారు చేస్తారంటే ?
నేడు దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయోధ్యలో అయితే ఇసుకవేస్తే రాలనంతంగా.. అయోధ్య నగరం భక్తులతో నిండిపోయింది.
నేడు దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయోధ్యలో అయితే ఇసుకవేస్తే రాలనంతంగా.. అయోధ్య నగరం భక్తులతో నిండిపోయింది. ఇక మన దక్షిణ అయోధ్య గా పిలువబడే తెలంగాణ లోని భద్రాచలం లో సీతారాముల కల్యాణ్ కోసం రెండు తెలుగు రాష్ట్రాలనుంచి భక్తులు తరలివచ్చారు. ఇక ఉగాది తర్వాత వచ్చే మొదటి పండుగ కావడంతో భక్తులు సీతారాముల కల్యాణ్ం ను కళ్ళారా చూసేందుకు తరలి వస్తున్నారు.
భద్రాచలంలో సీతారాముల కల్యాణం అపూర్వ ఘట్టాలలో తలంబ్రాలకు ఓ ప్రత్యేకత ఉంది అని చెప్పుకోవాలి. సీతారామలు కల్యాణంకు వాడే తలంబ్రాలను రామ భక్తులు స్వయంగా చేతి వేళ్ల గోటితో ఒలిచి ఆలయానికి సమర్పిస్తారు. ఆ తలంబ్రాలు సీతారాముల కల్యాణానికి వాడతారు. ఈ ప్రత్యేక తలంబ్రాల తయారీకి రెండు రాష్ట్రాలకు చెందిన రామ భక్తులు పాల్గొంటారు. రామ భక్తులు ప్రత్యేకంగా 250 మందికి పైగా సాంప్రదాయ పద్ధతుల ద్వారా వరి సాగు చేస్తారు. ఈ వరిని స్వయంగా రామ భక్తుతులు మాత్రమే కోసి.. నూర్పిడి చేసి వడ్లను మారుస్తారు.
అలా పండించిన బియ్యాన్ని.. శ్రీరామ భక్తులు దక్షిణ అయోధ్య భద్రాచలం పై కాలినడకన శోభాయాత్రగా వచ్చి రామాలయం దేవస్థానం చేరుకోని ఏలాంటి కృత్రిమ ఎరువులు వాడకుండా ప్రకృతి సేద్యంతో పండించిన వరి బియ్యం రాములవారికి సమర్పించుకున్నారు. అలా తీసుకొచ్చిన బియ్యం రామభక్తులు గోటితో ఒలిచి పంపుపు కుంకుమ కలిపి తలంబ్రాలుగు తయారు చేస్తారు. ఇలా తలంబ్రాల తయారీ సంప్రదాయం.. వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారంగా భద్రాద్రి ఆలయ కమిటి చేబుతోంది.