Damage to Maldives Tourism : భారత్ తో పెట్టుకుంటారా ? మాల్దీవులకు మోత మోగుతోంది

భారతీయులతో పెట్టుకున్నందుకు మాల్దీవులకు మోత మామూలుగా మోగడం లేదు. ప్రధాని మోడీతో పాటు భారతీయులను అవమానిస్తూ ఆ దేశ మంత్రులు చేసిన కామెంట్స్ ....మాల్దీవులను కోలుకోలేని తీసింది. అక్కడి టూరిస్ట్ ప్లేసుల్లోని హోటళ్ళు బుకింగ్స్ రోజుకి వేలల్లో క్యాన్సిల్ అవుతున్నాయి. రెండు రోజుల్లోనే మాల్దీవుల పర్యాటక రంగం లక్షల రూపాయలు నష్టపోయింది.  అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులు, ఎంపీని మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది.  అయినా సోషల్ మీడియాలో బాయ్ కాట్ మాల్దీవ్స్ హ్యాష్ ట్యాగ్ తో భారత్ లో మొదలైన వ్యతిరేకత విదేశాలకు కూడా పాకుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 8, 2024 | 10:44 AMLast Updated on: Jan 08, 2024 | 4:13 PM

Damage To Maldives Tourism Boycottmaldives

వారం రోజుల క్రితం లక్షద్వీప్ (Lakshadweep ) వెళ్ళిన ప్రధాని నరేంద్రమోడీ (PM Narendra Modi) అక్కడి పర్యాటకాన్ని ప్రోత్సాహించాలని ట్వీట్ చేశారు. లక్షద్వీప్ లో ఆయన స్నార్కెలింగ్ చేయడంతో పాటు… సముద్రం భూగర్భంలోకి వెళ్ళొచ్చిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే గత కొంత కాలంగా మాల్దీవులకు భారత్ అంటే పడటం లేదు.  అక్కడ కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు (Mohammad Moijju)… చైనాకు అనుకూలంగా, ఇండియాకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచారు. గత అధ్యక్షుడు మహ్మద్ సోలి ఇండియా ఫస్ట్ అంటే… మయిజ్జు మాత్రం ఇండియా ఔట్ అనే నినాదం ఇచ్చారు. మాల్దీవుల్లో రక్షణ కార్యకలాపాల్లో ఉన్న 75 మంది భారతీయ సైనికులను వెళ్ళిపోవాలని కూడా ఆదేశించాడు.  ఈ గొడవ ఇలా ఉండగానే… మన దేశ పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన లక్షద్వీప్ టూర్ ని మాల్దీవుల మంత్రులు, ఎంపీ టార్గెట్ చేసుకున్నారు.  మన దేశ టూరిజాన్ని తిడుతూనే… మోడీతో పాటు భారతీయులను అవమానించేలా జాతి అహంకార వ్యాఖ్యలు చేశారు.

ఈ కామెంట్స్ తో మండిపడ్డ పొలిటికల్ లీడర్లు, బాలీవుడ్ ప్రముఖులు, నటులు, క్రికెటర్లు, నెటిజెన్లు… సోషల్ మీడియాలో బాయ్ కాట్ మాల్దీవ్స్ పేరుతో హ్యాష్ ట్యాగ్ పెట్టి నిరసన తెలుపుతున్నారు.  ఇప్పటికే అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, శ్రద్దా కపూర్  సహా బాలీవుడ్ నటులు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలు ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు.  ఇక నుంచి మాల్దీవులకు వెళ్ళరాదని డిసైడ్ అయ్యారు.  కొందరు తమ పర్యటనలు రద్దు చేసుకున్నారు.

మాల్దీవులు పూర్తిగా పర్యాటక రంగంపైనే ఆధారపడి ఉంది.  ఇందులో భారతీయుల నుంచే భారీగా ఆదాయం వస్తోంది. లక్షల్లో అక్కడికి వెళ్తున్న ఇండియన్స్… కోట్ల రూపాయల ఆదాయాన్ని అక్కడి టూరిజానికి అందిస్తున్నారు. 2022లో 2 లక్షల 41 వేల మంది, 2023లో 2 లక్షల మంది భారతీయులు మాల్దీవులను సందర్శించారు.  ఇప్పుడు ముగ్గురు మంత్రులు, ఓ ఎంపీ చేసిన కామెంట్స్ తో… వేల మంది తమ టూర్స్ క్యాన్సిల్ చేసుకున్నారు.  హోటళ్ళు, ఫ్లయిట్స్, నేవీ బుకింగ్స్ భారీ సంఖ్యలో క్యాన్సిల్ అవుతున్నాయి. దాంతో మాల్దీవుల పర్యాటక రంగం ఘోరంగా దెబ్బతింటోంది.  భారత్ పై వివాదస్సద కామెంట్స్ చేసిన ముగ్గురు మంత్రులను కేబినెట్ నుంచి తొలగించింది ప్రభుత్వం. ఆ కామెంట్స్ తో ప్రభుత్వానికి సంబంధం లేదని ప్రకటింది. కానీ ఇప్పటికే మాల్దీవులకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  ఆ దేశంపై భారతీయుల్లో వ్యతిరేకత పెరిగిపోయింది.  ఇటు భారత్ లో లక్షద్వీప్, అండమాన్ నికోబార్, తమిళనాడు, కేరళ, కర్ణాటకతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న టూరిజం ప్లేసెస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఇండియన్స్.  బాలీవుడ్, క్రికెట్ ప్రముఖులు మన దేశ పర్యాటకానికి అనుకూలంగా ట్వీట్స్ చేస్తున్నారు.  భారతీయులకు రష్యా సహా కొన్ని మిత్ర దేశాల నెటిజెన్స్ కూడా మద్దతిస్తున్నారు. తాము కూడా మాల్దీవ్స్ టూర్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు ప్రకటించారు.  మొత్తానికి భారత్ తో పెట్టుకుంటే ఏమవుతోంది మాల్దీవులకు ఇప్పుడు బాగా తెలిసొస్తోంది.