Dangal, Suhani Bhatnagar : దంగల్ నటి సుహానీ భట్నాగర్ మృతికి ఆ వ్యాధే కారణం
బాలీవుడ్ (Bollywood) లో విషాద ఘటన జరిగింది. ఆమీర్‌ఖాన్ లీడ్‌రోల్‌లో వచ్చిన దంగల్ సినిమాలో.. చిన్నప్పటి బబిత ఫోగట్ రోల్ చేసిన సుహానీ భట్నాగర్ (Suhani Bhatnagar) కన్నుమూసింది. 19 ఏళ్ల వయసులోనే ఆమె తన ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమీర్‌ఖాన్ నిర్మాణ సంస్థ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. సుహానీ లేకుండా దంగల్ సినిమా అసంపూర్ణమని.. అలాంటి మంచి యాక్టర్ ఇంత చిన్న వయసులో చనిపోవడం చాలా బాధాకరమంటూ పోస్ట్ చేశారు.
బాలీవుడ్ (Bollywood) లో విషాద ఘటన జరిగింది. ఆమీర్‌ఖాన్ లీడ్‌రోల్‌లో వచ్చిన దంగల్ సినిమాలో.. చిన్నప్పటి బబిత ఫోగట్ రోల్ చేసిన సుహానీ భట్నాగర్ (Suhani Bhatnagar) కన్నుమూసింది. 19 ఏళ్ల వయసులోనే ఆమె తన ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమీర్‌ఖాన్ నిర్మాణ సంస్థ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. సుహానీ లేకుండా దంగల్ సినిమా అసంపూర్ణమని.. అలాంటి మంచి యాక్టర్ ఇంత చిన్న వయసులో చనిపోవడం చాలా బాధాకరమంటూ పోస్ట్ చేశారు. 19 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోయింది అంటే.. అసలు భట్నాగర్ కు ఏమైంది అనేది ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న. దీని గురించి భట్నాగర్ కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. వాళ్లు చెప్పినదాని ప్రకారం భట్నాగర్ ఓ అరుదైన వ్యాధి (Rare Disease) తో బాధపడుతూ చనిపోయింది. రెండు నెలల క్రితం భట్నాగర్ కుడిచెయ్యి బాగా వాపెక్కడం గమనించారు ఆమె కుటుంబ సభ్యులు. అయితే దాన్ని పెద్ద సమస్యగా తీసుకోలేదు. కొన్ని రోజులకు ఆ వాపు ఎక్కువవడంతో పాటు మరో చేతికి కూడా అదే సమస్య వచ్చింది.
ఇలా ఆ వాపు శరీరంమంతా వ్యాపించడం మొదలుపెట్టింది. దీంతో ఇది సాధారాణ విషయం కాదని భావించిన ఆమె పేరెంట్స్.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించారు. భట్నాగర్ బ్లడ్ శాంపుల్స్ తీసుకున్న డాక్టర్లు కొన్ని టెస్టులు చేశారు. డెర్మటో మయోసైటిస్ అనే వ్యాధితో భట్నాగర్ బాధపడుతుందని చెప్పారు. ఇది చాలా అరుదైన వ్యాధి. దీనికి పెద్దగా మెడిసిన్స్ కూడా ఉండవు. స్టెరాయిడ్స్‌తో పేషెంట్ పరిస్థితిని కంట్రోల్ చేయడం ఒక్కటే దారి. ఆ స్టెరాయిడ్స్ పేషెంట్‌కు సెట్ అవుతాయా లేదా అన్నది కూడా డౌటే. ఓవరాల్‌గా డాక్టర్లు చెప్పింది ఏంటి అంటే.. భట్నాగర్ పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్. ఏదైనా చేయాలి అంటే స్టెరాయిడ్స్‌తో ప్రయత్నించడమే. భట్నాగర్ పేరెంట్స్ పర్మిషన్‌తో ఆమెకు స్టెరాయిడ్స్ ఇవ్వడం మొదలు పెట్టారు డాక్టర్లు. కానీ ఆ ఎఫెక్ట్‌ను భట్నాగర్ తట్టుకోలేకపోయింది. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణించడంతో పాటు.. రీసెంట్‌గా ఆమెకు ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది.
ఆ ఇన్ఫెక్షన్, స్టెరాయిడ్స్ భట్నాగర్ లంగ్స్ మీద తీవ్ర ప్రభావం చూపించాయి. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి భట్నాగర్ ప్రణాలు కోల్పోయింది. దంగల్ సినిమాతో ఎంతో మందిని మెప్పించిన భట్నాగర్‌కు ఇలా జరగడం ప్రతీ ఒక్కరినీ కన్నీరు పెట్టించింది. దంగల్ సినిమా (Dangal Movie) ఆడిషన్స్‌కు దాదాపు 20 వేల మంది హాజరైతే అందులో భట్నాగర్ మాత్రమే సినిమాకు సెలెక్ట్ అయ్యింది. ప్రస్తుతం జర్నలిజం (Journalism) అండ్ మాస్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చేస్తోంది భట్నాగర్. డిగ్రీ పూర్తైన వెంటనే ఫుల్ టైం యాక్టర్‌గా మారిపోవాలి అనుకుంది కానీ.. ఈలోపే డెర్మటో మయోసైటిస్ భట్నాగర్‌ను పొట్టన పెట్టుకుంది.