బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పుడు లారెన్స్ గ్యాంగ్ దెబ్బకు భయపడిపోతున్నాడు. అసలు ఇంట్లో నుంచి బయటకు రావాడానికి కూడా సల్మాన్ ఖాన్ సాహసం చేయడం లేదు. ఎప్పుడు... ఎవరు ఏ రూపంలో టార్గెట్ చేస్తారో అనే భయం సల్మాన్ లో స్పష్టంగా కనపడుతోంది. సల్మాన్ ఖాన్ ఏ రేంజ్ లో సెక్యూరిటీ పెంచుకున్నా ప్రాణ భయం మాత్రం దారుణంగా ఉంది. సినిమా షూటింగ్ లు బిగ్ బాస్ షూటింగ్ లకు కూడా సల్మాన్ ఖాన్ దూరంగా ఉంటున్నాడు. ఇక అమెరికా కూడా వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. సల్మాన్ ఖాన్ కు మహారాష్ట్ర ప్రభుత్వం ఏ రేంజ్ లో భద్రత కల్పిస్తుందో అనే భయం కూడా ఫ్యాన్స్ లో ఉంది. ఈ టైం లో సల్మాన్ రిస్క్ చేస్తూ దుబాయ్ లో ఓ షో కూడా చేయడానికి రెడీ అవుతున్నాడు. సల్మాన్ ను టార్గెట్ చేసిన లారెన్స్ గ్యాంగ్... ఇటీవల బాబా సిద్దిఖీని చంపిన తర్వాత, సల్మాన్ స్నేహితులకు కూడా వార్నింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. బీహార్ ఎంపీ పప్పు యాదవ్ కు లారెన్స్ వాయిస్ మెసేజ్ పెట్టాడు. సల్మాన్ తో స్నేహం చేస్తే చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు కూడా. దీనితో సల్మాన్ కు స్నేహితులు దూరమవుతున్నారు. ఇక ఇప్పుడు సల్మాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్... సోమీ అలీ సంచలన వ్యాఖ్యలు చేసింది. నేను బాలీవుడ్‌లో వర్క్ చేసిన సమయంలో దావుద్ ఇబ్రహీం, చోటా షకీల్ గురించి చాలామంది నటీనటులు మాట్లాడుకోవడం విన్నాను అని తెలిపింది. వీరిలో ఎవరూ ప్రత్యక్షంగా మాట్లాడుకునేవారు కాదని పేర్కొంది. ‘అండర్ వరల్డ్’ అని కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకునేవారని గుర్తు చేసుకుంది. సల్మాన్ తో కలిసి గ్యాలెక్సీ నివాసంలో ఉన్న సమయంలో ఆయనకు ఓసారి అండర్ వరల్డ్ నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని తెలిపింది. ఫోన్ ఎవరు చేశారో తెలియదు కానీ.. అతడు మాత్రం బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె పేర్కొంది. ‘సల్మాన్ కు చెప్పు.. ఆయన ప్రియురాలిని మేము కిడ్నాప్ చేయనున్నామని అని ఫోన్ లో అన్నారని ఆమె పేర్కొంది. అతడి మాటలతో నాకెంతో భయం కలిగిందని అప్పటి పరిస్థితిని ఆమె గుర్తు చేసుకుంది. వెంటనే ఆ విషయాన్ని సల్మాన్‌కు చెప్పానని... ఆయన కూడా కంగారుపడ్డారని పేర్కొంది. పరిస్థితులు చక్కబడేలా చేశారని... ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకుందామని ఎన్నోసార్లు ప్రయత్నించానని తెలిపిన ఆమె... సల్మాన్ ను అడిగితే ఈ విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది’ అని చెప్పినట్టు సోమీ అలీ పేర్కొంది.