డికాక్ మెరుపు ఇన్నింగ్స్ బార్బడోస్ రాయల్స్ విక్టరీ

కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో విదేశీ ఆటగాళ్ళు దుమ్మురేపుతున్నారు. ఐపీఎల్ మెగావేలం ముంగిట మెరుపులు మెరిపిస్తున్నారు. సఫారీ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 45 బంతుల్లోనే 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 87 రన్స్ చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 2, 2024 | 02:42 PMLast Updated on: Sep 02, 2024 | 2:42 PM

De Kocks Brilliant Innings In Barbados Royals Victory

కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో విదేశీ ఆటగాళ్ళు దుమ్మురేపుతున్నారు. ఐపీఎల్ మెగావేలం ముంగిట మెరుపులు మెరిపిస్తున్నారు. సఫారీ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 45 బంతుల్లోనే 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 87 రన్స్ చేశాడు. డికాక్ బార్బడోస్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. భారీ లక్ష్యం కాకపోయినా ఈ సఫారీ కీపర్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో ఫాల్కన్స్ పై 146 ప‌రుగుల ల‌క్ష్యాన్ని బార్బడోస్ రాయల్స్ కేవ‌లం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. అతడితో పాటు మరో ఓపెనర్ కార్న్‌వాల్‌ సైతం దూకుడుగా ఆడాడు. దీంతో రాయల్స్ మరో 4.3 ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్ అందుకుంది.