Asaduddin Owaisi : అసదుద్దీన్ ఒవైసీ కి హత్య బెదిరింపులు..
హైదరబాద్ ఎంపీని చంపేస్తామంటూ బెదిరింపులు.. తనను హతమారుస్తామని SMSలు, ఫోన్‌కాల్స్‌లో బెదిరింపులు వస్తున్నాయని MIM చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

Death threats to Asaduddin Owaisi
హైదరబాద్ ఎంపీని చంపేస్తామంటూ బెదిరింపులు.. తనను హతమారుస్తామని SMSలు, ఫోన్‌కాల్స్‌లో బెదిరింపులు వస్తున్నాయని MIM చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లింలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వేషం పెంచుకుందని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యూపీలో తనపై కాల్పులు జరిపిన దుండగులను ఇప్పటికీ అరెస్ట్ చేయలేదని దుయ్యబట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలను అణచివేసే యత్నం చేస్తున్నారన్నారు.
గతంలో ఢిల్లీలోని తన అధికారిక నివాసంపై పలుమార్లు దాడులు చేశారని అసదుద్దీన్ ఆరోపించారు. కాగా ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ప్రచారానికి వెళ్తున్న తనపై ఆరు రౌండ్ల కాల్పులు జరిపిన దుండగుల్లో ఒక్కరిని కూడా ఇంతవరకు అరెస్టు చేయలేదని విమర్శించారు. ఇలా ఒక పార్లమెంట్ ఎంపీపై దాడులు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం, యూపీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.