Sharmila: షర్మిలకు అంత సీన్ లేదు.. 40 సీట్లు కావాలంట.. ఇంకేం వద్దా..?
రేపో..మాపో షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో వీలినం చేస్తుందంటున్నారు.. అయితే షర్మిల డిమాండ్లు మాత్రమే విచిత్రంగా ఉన్నాయి.. ఇంతకీ షర్మిలా ఏం అడుగుతున్నారు..?

Decks cleared for Jagan sister Sharmilas YSRTP Cong merger amid some hiccups as she asking 40 seats out of 119
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ వైటీపీ అంటూ పార్టీ పెట్టిన షర్మిలకు ఫస్ట్ నుంచి ఏదీ కలిసిరాలేదు.. మీడియా పెద్దగా పట్టించుకోలేదు.. హైదరాబాద్ పోలీసులు షర్మిల కారును ఆమెతో పాటే లాక్కెళ్లినప్పుడు కాస్త హైప్ వచ్చింది అంతే. ఏదో పాదయాత్రలంటూ బయలుదేరినా రావాల్సిన పబ్లిసిటీ రాలేదు. దీంతో కొన్నాళ్లు ఆమె బీజేపీకి దగ్గరైనట్టు కనిపించారు. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రూట్ మార్చారు. అక్కడి డీకే శివకుమార్‌తో పలుమార్లు భేటి అయిన షర్మిల ఆమె పార్టీని కాంగ్రెస్‌తో విలీనం లేదా పొత్తుకు ఒప్పుకున్నారు. అయితే పార్టీ విలీనానికి షర్మిల పెడుతున్న కండీషన్స్‌తో కాంగ్రెస్ హైకమాండ్ షాక్ అయ్యింది.
40సీట్లు కావాలి:
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 27న షర్మిలతో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మీటింగ్ తర్వాత పార్టీతో పొత్తు లేదా వీలినంపై ఓ క్లారిటి రానుంది. తెలంగాణ కాంగ్రెస్ పెద్దల అభిప్రాయలు తెలుసుకోనున్నారు రాహుల్. ఇటు భట్టి విక్రమార్క్ లాంటి వాళ్లు షర్మిల రాకను ఆహ్వనిస్తుండగా..విహేచ్ మాత్రం షర్మిల లేదు.. గిర్మిల లేదు అంటున్నారు. రేవంత్ రెడ్డి కూడా అదే అంటున్నారు. ఇదే సమయంలో షర్మిల పొత్తు విషయాన్ని తెగే వరకు లాగుతున్నట్టు కనిపిస్తుంది. అసలు ప్రభావం చూపుతుందో లేదో తెలియని షర్మిల పార్టీతో కాంగ్రెస్‌కి ఏం ప్రయోజనం కలుగుతుందో ఇప్పటికైతే చెప్పడం కష్టమే కానీ.. ఆమె మాత్రం పోటి చేయడానికి 40సీట్లు కావాలని అడుగుతున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ వద్ద ఇదే విషయాన్ని షర్మిల ప్రస్తావించారు.
షర్మిల షరతుతో కంగుతున్న వేణుగోపాల్ ఆ విషయంపై తెలంగాణ కాంగ్రెస్‌ని సంప్రదించారు. షర్మిలకు అంత సీన్ లేదు అని.. 40సీట్ల డిమాండ్‌కి అంగీకరించవద్దని ఇక్కడి నేతలు చెప్పినట్టు సమాచారం. ఇక షర్మిలకు ఎలాగో ఒంటరిగా పోటి చేసే సత్తా లేదు.. రాజకీయ పార్టీని నడిపించడం అంటే చిన్న విషయం కాదు. షర్మిలనే తగ్గి కాస్త ఆలోచించి సీట్లు అడిగితే మంచిది.. లేకపోతే అసలకే ఎసరు వస్తుంది. ఉన్న ఆఫర్ కూడా పోతుంది. ఇప్పటికే కాంగ్రెస్‌లో కలిసిపోయినట్టుగా బీజేపీ, బీఆర్‌ఎస్‌పై షర్మిలా నోరు పారేసుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కాదంటే షర్మిల రాజకీయ జీవితం ఇక్కడతోనే ఎండ్‌కార్డ్ పడుతుంది.