Deepika Padukone : తల్లి కాబోతున్న దీపికా పదుకొనే.. సెప్టెంబర్‌లో డెలివరీ..!
బాలీవుడ్ (Bollywood) స్టార్ కపుల్ (Star Couple) తల్లిదండ్రులు కాబోతున్నారు. కొద్ది రోజులుగా దీపికా పదుకోన్ (Deepika Padukone)-రణ్ వీర్ (Ranveer) దంపతులు పేరెంట్స్ క్లబ్ లోకి చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. ఇటీవలే ఫిబ్రవరి 18 న లండన్ లో జరిగిన బాఫ్టా కార్యక్రమంలో దీపికా హోస్ట్ గా పాల్గొన్నారు. అప్పటి నుంచి ప్రెగ్నెన్సీ (Pregnancy) వార్తలు మరింత ఊపందుకున్నాయి.

ఈ ఈవెంట్ లో దీపికా.. తన చీర కొంగుతో బేబీ బంప్ ను దాచడానికి ప్రయత్నించారంటూ గాసిప్స్ మొదలయ్యాయి. ఇక ఈ అనుమానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ సోషల్ మీడియా వేదికగా ఈ జంట ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేస్తూ ఓ పోస్టు షేర్ చేశారు. అతి త్వరలోనే వీరి ఇంట్లో నవ్వులు విరజిమ్మనున్నాయని తమ సంతోషాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. అంతేకాక డెలివరీ డేట్ ను ప్రకటిస్తూ చేసిన ఆ పోస్టు నెట్టింటా వైరల్ గా మారింది. డ్యూ డేట్ ఎప్పుడో చెప్పి.. క్రియేటివ్‌గా వారి ప్రెగ్నెన్సీ గురించి అనౌన్స్ చేయగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
2024 సెప్టెంబర్ లో డెలివరీ కాబోతున్నట్లు దీపికా పదుకోన్-రణ్ వీర్ సింగ్ దంపతులు వెల్లడించారు. సెప్టెంబర్ లో తమ మొదటి బిడ్డను పొందనున్నారు ఈ జంట. దీపికా చేసిన పోస్టులో పిల్లలకు సంబంధించిన బట్టలు, షూస్, బెలూన్స్ ఉండడంతో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసినట్లైంది. ఈ విషయం తెలిసిన అభిమానులు, ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా 2018లో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్- దీపికా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం ఈ జంట వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు.