X POSTS DELETE : X లో టీడీపీ, వైసీపీ… పోస్టులు డిలీట్

ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీలను డీగ్రేడ్ చేయడానికి సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేయడానికి వీల్లేదు. ఎన్నికల కమిషన్ ఈ విషయంలో స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాపై గట్టి నిఘా పెట్టింది. ఏపీలో టీడీపీ, వైసీపీ (YCP) కి చెందిన పోస్టులతో పాటు ఆప్, బీజేపీకి చెందిన పోస్టులను కూడా X నుంచి డిలీట్ చేయించింది కేంద్ర ఎన్నిలక సంఘం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 17, 2024 | 04:00 PMLast Updated on: Apr 17, 2024 | 4:00 PM

Deleted Posts Of Tdp Ycp In X

ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీలను డీగ్రేడ్ చేయడానికి సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేయడానికి వీల్లేదు. ఎన్నికల కమిషన్ ఈ విషయంలో స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాపై గట్టి నిఘా పెట్టింది. ఏపీలో టీడీపీ, వైసీపీ (YCP) కి చెందిన పోస్టులతో పాటు ఆప్, బీజేపీకి చెందిన పోస్టులను కూడా X నుంచి డిలీట్ చేయించింది కేంద్ర ఎన్నిలక సంఘం.

ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు, నాయకులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లో పెడుతున్న పోస్టులపై కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్ చేసింది. లేటెస్ట్ గా కొన్ని పోస్టుల తొలగింపుపై X‌కు ఈసీ ఆదేశాలిచ్చింది. ఇందులో ఏపీకి చెందిన YCP, TDPతో పాటు… ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party), బీజేపీ నాయకులు పెట్టిన నాలుగు పోస్టులను తొలగించాలని Xకు ఆర్డర్స్ జారీ చేసింది. ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల నోడల్ అధికారుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో ఈసీ ఈ చర్యలు చేపట్టింది. ఈసీ ఆదేశాలతో X కూడా నాలుగు పోస్టులను డిలీట్ చేసింది. ఇవి ఇండియాలో మాత్రమే డిలీట్ అవుతాయి. ఇతర దేశాల్లో మాత్రం కనిపిస్తాయి. ఆపోజిట్ కేండిడేట్ వ్యక్తిగత జీవితాలను టార్గెట్ గా చేసుకుని రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని ఈసీ నిషేధించింది. అలాంటి పోస్టులను గుర్తించి, డిలీట్ చేయిస్తోంది.

టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) Xలో చేసిన ఓ పోస్టులో సీబీఐ (CBI) డాక్యుమెంట్ ఉంది. ఆమధ్య వైజాగ్ పోర్ట్ లో 25 వేల కిలోల డ్రగ్స్ ను CBI స్వాధీనం చేసుకుంది. ఏపీ పోలీసులు, పోర్టు ఉద్యోగులు.. ఈ డ్రగ్స్‌ స్వాధీనం చేసుకోడానికి CBIకి సహకరించలేదని ట్వీట్ లో ఉంది. ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ ప్రమేయం ఉందంటూ చంద్రబాబు పెట్టిన పోస్టును తొలగించాలని Xను ఈసీ ఆదేశించింది. దాన్ని డిలీట్ చేశారు. అలాగే ఈసీ అభ్యంతరంతో YCP తన అఫీషియల్ పేజీలో పెట్టిన ఓ వివాదస్పద పోస్టును పార్టీ వర్గాలు తొలగించాయి.

ఈడీ (ED), కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆప్ పెట్టిన పోస్టులను ఈసీ ఆదేశాలతో తొలగించింది. ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో పెట్టి… దానిపై బాండ్ చోర్ అనే క్యాప్షన్ పెట్టిన పోస్టును కూడా ఎక్స్ డిలీట్ చేసింది. అరబిందో ఫార్మా డైరెక్టర్‌ను మొదట ఈడీ అరెస్టు చేసిందనీ… ఆ తర్వాతే అరబిందో ఫార్మా ఎలక్ట్రోరల్ బాండ్లు కొన్నదంటూ ఆ పోస్టులో ప్రస్తావించారు.
బిహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి X అకౌంటు నుంచి ఓ ట్వీట్ ను ఈసీ డిలీట్ చేసింది. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకోవడంలో సీజన్డ్ ప్లేయర్ లాంటివాడని ఆ పోస్టులో సామ్రాట్ చౌదరి విమర్శించారు. ఎంపీ టికెట్ల అమ్మకంలో చివరకు కూతుర్ని కూడా వదల్లేదు… ఆమె నుంచి కిడ్నీ తీసుకుని లాలూ టికెట్ ఇచ్చారంటూ చేసిన వివాదాస్పద పోస్టును ఈసీ డిలీట్ చేయించింది.