Arvind Kejriwal: కవిత తర్వాత కేజ్రీవాల్..? ఢిల్లీ హైకోర్టులో దక్కని ఊరట..
ఇప్పుడు కవిత తర్వాత కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కి 9వ సారి సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు.
Arvind Kejriwal: లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. ఆయన అరెస్ట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈడీ ఇప్పటికి 9సార్లు నోటీసులిచ్చినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈడీ తనపై ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ హైకోర్టు కెక్కినా.. ఆయనకు ఎలాంటి రిలీఫ్ దక్కలేదు. అరెస్ట్ చేయొద్దని తాము ఈడీని ఆదేశించలేమని.. ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేమని కోర్టు తేల్చిచెప్పింది. కేజ్రీవాల్ నేరానికి పాల్పడినట్టు తమ దగ్గర ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నాయని ఈడీ హైకోర్టుకు స్పష్టం చేసింది.
Lucknow Super Giants: లక్నోకు ఊహించని షాక్.. ఆరంభ మ్యాచ్ లకు స్టార్ పేసర్ దూరం
ఇక ఇప్పుడు కవిత తర్వాత కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కి 9వ సారి సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. ఈ కేసులో ఈడీ అన్యాయంగా ఇరికించేంచే ప్రయత్నం చేస్తోందనీ.. అధికారులు అరెస్ట్ చేయకుండా రిలీఫ్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు కేజ్రీవాల్. తాము అధికారులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామనీ.. అయితే ఈడీ.. ఇండిపెండెంట్ ఏజెన్సీ కాదన్నారు ఢిల్లీ మంత్రి అతీష్. బీజేపీ చెప్పినట్టు నడుస్తోందనీ.. సొంతంగా దర్యాప్తు చేయట్లేదని ఆరోపించారు. రెండుళ్ళుగా విచారణ సాగుతోందని, చాలా ప్రాంతాల్లో సోదాలు చేసినా ఇప్పటి వరకూ ఈడీ ఎలాంటి ఎవిడెన్స్ సాధించలేదన్నారు. కేజ్రీ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు కొన్ని ఈడీపై కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా.. ఉంటే మధ్యాహ్నం రెండున్నరకు తమ ఛాంబర్‌లో ఫైళ్ళు సమర్పించాలని న్యాయమూర్తులు కోరారు. వీటిని పరిశీలించిన న్యాయమూర్తులు.. కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయొద్దని ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పారు.
ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. ఈడీ సమన్లు జారీ చేయడంపై వేసిన కేసుతో పాటు దీన్ని కూడా విచారిస్తామని తెలిపింది. ఈమధ్య కవిత అరెస్ట్ చేసినప్పుడు రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ కస్టడీ పిటిషన్ సమర్పించింది. అందులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కలిసి కవిత ఈ స్కామ్‌కి పాల్పడినట్టు క్లియర్‌గా ఈడీ పేర్కొంది. అందువల్ల కవిత తర్వాత కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు.