Delhi Metro: ఢిల్లీ మెట్రో వైరల్ వీడియో.. షాకింగ్ న్యూస్..

మెట్రోలో అలాంటి వీడియో చేసిన అమ్మాయిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై విమర్శలు రావడంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) స్పందింది. ఈ వీడియోపై విచారణ జరుపుతున్నామని తెలిపింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 24, 2024 | 08:05 PMLast Updated on: Mar 24, 2024 | 8:26 PM

Delhi Metro On Viral Video Of Women Playing Holi Inside Train

Delhi Metro: ఢిల్లీ మెట్రోలో అమ్మాయిలు హోలీ ఆడుకున్న వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. బ్యాగ్రౌండ్‌లో హిందీ పాట ప్లే అవుతుండగా, అమ్మాయిలు అభ్యంతరకరంగా హోలీ రంగులు పూసుకున్నారు ఆ వీడియోలో. దగ్గరగా కూర్చుని ఉన్న వాళ్లు కూడా అమ్మాయిల తీరు చూసి ఇబ్బంది పడ్డారు.

Uttar Pradesh: మొబైల్ పేలి చెలరేగిన మంటలు.. నలుగురు చిన్నారులు మృతి..

దీనిపై నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మెట్రోలో అలాంటి వీడియో చేసిన అమ్మాయిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై విమర్శలు రావడంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) స్పందింది. ఈ వీడియోపై విచారణ జరుపుతున్నామని తెలిపింది. అయితే, ఈ విషయంలో సంచలన విషయం వెల్లడించింది. వీడియో డీప్ ఫేక్ అయ్యుండొచ్చని అభిప్రాయపడింది. తమ ప్రాథమిక అంచనా ప్రకారం.. ట్రైన్‌లో షూట్ చేసినట్లు కనిపిస్తున్న ఈ వీడియో డీప్ ఫేక్ టెక్నాలజీ వాడి తీసుండొచ్చని డీఎంఆర్‌సీ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం మెట్రో ట్రైన్ వీడియో ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

మెట్రో రైలులో రీల్స్ తీసుకోవడం వంటివి నిషేధించామన్నారు. ఈ విషయంపై ప్రయాణికులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా రైలులో అభ్యంతరకంగా ఉన్నా, వీడియోలు తీస్తూ కనిపించినా వెంటనే సిబ్బందికి చెప్పాలని సూచించారు.