దేవర గ్లింప్స్: కొరటాల మామూలోడు కాదురా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా అంటే... సినీ జనాల్లో ఉండే క్రేజ్ పీక్స్ లో ఉంటుంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆ క్రేజ్ నేషనల్ లెవెల్ లో పెరిగింది. ఎన్టీఆర్ సినిమాలకు ఇప్పుడు నేషనల్ లెవెల్ లో ఫాలోయింగ్ పెరిగింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 16, 2024 | 06:06 PMLast Updated on: Aug 16, 2024 | 6:11 PM

Devara Movie Glimps

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా అంటే… సినీ జనాల్లో ఉండే క్రేజ్ పీక్స్ లో ఉంటుంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆ క్రేజ్ నేషనల్ లెవెల్ లో పెరిగింది. ఎన్టీఆర్ సినిమాలకు ఇప్పుడు నేషనల్ లెవెల్ లో ఫాలోయింగ్ పెరిగింది. ఈ నందమూరి హీరో ఇప్పుడు దేవర అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వచ్చే నెల విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహకాలు చేస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఏ రేంజ్ లో ఉంటుందా అనే దానిపై ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగిపోతుంది. ఎన్టీఆర్ గత సినిమాల కంటే భిన్నంగా ఉంటాడు అనే క్లారిటీ వచ్చేసింది.

దీనితో తన నట విశ్వరూపాన్ని ఏ రేంజ్ లో చూపిస్తాడు అనేది ఇప్పుడు ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోతుంది. ఈ సినిమాలో లవ్ ట్రాక్ మీద బాగానే ఫోకస్ చేసాడు అనేది క్లియర్ గా ఒక్క పాటతో చెప్పాడు డైరెక్టర్. ఇప్పుడు విడుదల చేసిన ఒక గ్లింప్స్ తో విలన్ ఎంత భయంకరంగా ఉంటాడు అనేది కూడా క్లియర్ గా చెప్పేసాడు దర్శకుడు కొరటాల శివ. కాసేపటి క్రితం విడుదలైన 52 సెకన్ల గ్లింప్స్ లో విలన్ సైఫ్ అలీ ఖాన్ పాత్రను పరిచయం చేసాడు. విలనిజం పీక్స్ లో ఉండబోతుంది అనేది గ్లింప్స్ స్టార్టింగ్ స్టార్ట్ తోనే అర్ధమైపోయింది.

ఈ క్యారెక్టర్ పేరు భైరా… విలన్ గా సైఫ్ సినిమా కోసం ప్రాణం పెట్టినట్టే కనిపించాడు. ఇప్పటి వరకు హీరో పాత్రలతో సినీ జనాలకు పరిచయం అయిన ఈ బాలివుడ్ సీనియర్ హీరో… ఈ సినిమాతో తనలో ఉన్న భయంకరమైన విలన్ ను చూపించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటి వరకు కొన్ని నెగటివ్ పాత్రలు చేసినా… ఇది మరింత భిన్నంగా ఉంటుంది అనేది అర్ధమైంది. ఇందులో విలన్ మల్ల యోధుడు అనేది అర్ధమైంది. మరి ఎన్టీఆర్, సైఫ్ మధ్య సీన్స్ ని ఏ విధంగా దర్శకుడు డిజైన్ చేసాడనేది ఇప్పుడు జనాల్లో ఆసక్తి పెరిగిపోతుంది.