Yadadri : యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. కొడ్డం నిండా భక్తులతో కిటకిట
తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజుతోపాటు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు.

Devotees flocked to Yadadri.. Koddam was full of devotees
తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజుతోపాటు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. స్వయంభువుడైన శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో బారులు తీరారు. ఉదయం నుంచే క్యూ లైన్లలో వేచి ఉన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లడ్డు ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రతమండపం, కల్యాణ కట్ట కొండ కింద విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్, బస్లాండ్ ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది. దీంతో స్వామివారి ఉచిత దర్శనానికి దాదాపు 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. బ్రేక్ దర్శనానికి సైతం భక్తులు అధిక సంఖ్యలో వెళ్లారు.