DHONI IPL CAPTAIN : ఐపీఎల్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ టీమ్ కెప్టెన్‌గా ధోనీ…
చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్, టీమిండియా (Team India) దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) కి అరుదైన గౌరవడం దక్కింది. ఇండియన ప్రీమియర్ లీగ్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ టీమ్ కెప్టెన్‌గా మిస్టర్ కూల్ ఎంపికయ్యాడు. పదిహేను మంది సభ్యులతో కూడిన అత్యుత్తమ జట్టుకు నాయకుడిగా అవకాశం దక్కించుకున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్, టీమిండియా (Team India) దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) కి అరుదైన గౌరవడం దక్కింది. ఇండియన ప్రీమియర్ లీగ్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ టీమ్ కెప్టెన్‌గా మిస్టర్ కూల్ ఎంపికయ్యాడు. పదిహేను మంది సభ్యులతో కూడిన అత్యుత్తమ జట్టుకు నాయకుడిగా అవకాశం దక్కించుకున్నాడు. మాజీ క్రికెటర్లు వసీం అక్రం, డేల్ స్టెయిన్, మాథ్యూ హెడన్, టామ్ మూడీతో పాటు సుమారు 70 మంది జర్నలిస్టులతో కూడిన నిపుణుల బృందం ఈ జట్టును ప్రకటించింది. అంతాకలిసి నాయకుడిగా ధోనికే ఓటు వేశారు. ఈ జట్టులో టాపార్డర్‌లో ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, టీమిండియా సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి, వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్‌లకు చోటు దక్కింది. అలాగే మిడిలార్డర్‌లో సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్, ధోని ఎంపికయ్యారు. ఇక హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కీరన్ పొలార్డ్‌లు ఆల్‌రౌండర్ల జాబితాలో చోటు దక్కించుకోగా.. రషీద్ ఖాన్, సునిల్ నరైన్, లసిత్ మలింగ, జస్‌ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్ బౌలింగ్ విభాగంలో చోటు దక్కించుకున్నారు. అయితే ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ రోహిత్‌శర్మకు కనీసం జట్టులో చోటు కూడా దక్కలేదు.
ఇదిలా ఉంటే చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు విజేతగా నిలిపిన ఘనత ధోని సొంతం. ధోని 5 వేలకు పైగా పరుగులు సాధించడంతో పాటు అత్యధికంగా 133 విజయాలు సాధించిన కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు. ఇక ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లి కొనసాగుతున్నాడు. అటు బౌలర్లలో చహల్ 187 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. పేసర్లు మలింగ, బుమ్రా ముంబై ఇండియన్స్ ఐదుసార్లు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించారు.