నా కొడుకు కెరీర్ నాశనం చేసింది ధోనీనే
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పై యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ధోని ఫాన్స్ యువీ తండ్రిపై మండిపడుతున్నారు.
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పై యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ధోని ఫాన్స్ యువీ తండ్రిపై మండిపడుతున్నారు.ధోనీపై గతంలో ఎన్నో విమర్శలు చేసిన యువీ తండ్రి.. తాజాగా మహిపై తన కోపాన్ని ప్రదర్శించాడు.తన కొడుకు యువరాజ్ సింగ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడని ఆరోపించాడు. ధోనిని తాను క్షమించననీ, అతను మొత్తం క్రెడిట్ ను తీసుకుంటాడన్నాడు. తన కొడుకుపై ఏం చేసాడనే ప్రతి విషయం ఇప్పుడు బయట పడుతుందన్నాడు.
యువరాజ్ సింగ్ తన క్రికెట్ కెరీర్ కు త్వరగా రిటైర్మెంట్ ప్రకటించడానికి ధోని కారణమని యోగరాజ్ సింగ్ కూడా ఆరోపించాడు. ఇంకా నాలుగైదేళ్లు ఆడగలిగే తన కొడుకు జీవితాన్ని ధోని నాశనం చేసాడని..యువరాజ్ లాంటి కొడుకు అందరికీ పుట్టాలని తాను ధైర్యంగా చెబుతానని వ్యాఖ్యానించాడు. అయితే యువి తండ్రి విమర్శలకు ధోనీ ఫాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. పబ్లిసిటీ కోసమే ఆయన పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ధోనీ ఎంతో మంది యువ ఆటగాళ్లను ప్రోత్సహించాడని గుర్తు చేస్తున్నారు.