Mahendra Singh Dhoni : తన సూపర్ ఫ్యాన్ కు ధోనీ సర్ ప్రైజ్..
అంతర్జాతీయ క్రికెట్ (International Cricket) నుంచి రిటైర్ అయినప్పటికీ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు.

Dhoni surprise for his super fans..
అంతర్జాతీయ క్రికెట్ (International Cricket) నుంచి రిటైర్ అయినప్పటికీ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ముఖ్యంగా ఐపీఎల్ (IPL) లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న ధోనీ అంటే తమిళియన్లు ఎంతగానో అభిమానిస్తారు. ఈ విషయంలో చిన్నా, పెద్దా అనే తేడాలేవీ ఉండదు. దీనికి తాజా ఉదాహరణ.. ఈ ఘటన. 103 సంవత్సరాల వయస్సు ఉన్న రామదాస్ అనే వయోధిక వృద్ధుడు. ధోనీకి వీరాభిమాని. తమిళనాడుకు చెందిన రామదాస్.. ఐపీఎల్ ఆరంభం నుంచీ ఆయన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ను ఎంతగా అభిమానిస్తారో.. అంతకంటే ఎక్కువ ధోనీని ఆరాధిస్తారు. సీఎస్‌కే (CSK) కు సపోర్ట్‌గా ఉంటూ వస్తోన్న రామదాస్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు ధోనీ.. తన సంతకంతో కూడిన షర్ట్‌ను ఆయనకు పంపించారు. థాంక్స్ తాత.. ఫర్ యువర్ సపోర్ట్.. అని రాసి సంతకం చేసిన షర్ట్ అది. దాన్ని అందుకుని రామదాస్ చిన్నపిల్లాడిలా మురిసిపోయారు.