వచ్చే ఐపీఎల్ లో ప్లేయర్ గానే ధోనీ ఫుల్ జోష్ లో సీఎస్కే ఫ్రాంచైజీ

ఐపీఎల్ మెగావేలానికి ముంది రిటెన్షన్ జాబితాను ఇచ్చేందుకు డెడ్ లైన్ దగ్గరపడింది. అక్టోబర్ 31 సాయంత్రం లోపు అన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్టును బీసీసీఐకి అందజేయాలి. ఈ నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీల కసరత్తు కూడా పూర్తయినట్టే కనిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 28, 2024 | 08:45 AMLast Updated on: Oct 28, 2024 | 8:45 AM

Dhoni Will Be A Player In The Next Ipl Csk Franchise In Full Swing

ఐపీఎల్ మెగావేలానికి ముంది రిటెన్షన్ జాబితాను ఇచ్చేందుకు డెడ్ లైన్ దగ్గరపడింది. అక్టోబర్ 31 సాయంత్రం లోపు అన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్టును బీసీసీఐకి అందజేయాలి. ఈ నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీల కసరత్తు కూడా పూర్తయినట్టే కనిపిస్తోంది. అయితే రిటెన్షన్ కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కు గుడ్ న్యూస్ అందింది. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వచ్చే సీజన్ లో ఆడబోతున్నాడు. దీనిపై తాజాగా ధోనీనే స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ఇంకా తనలో క్రికెట్ మిగిలే ఉందన్నాడు. మరికొన్నాళ్ళు ఆటను ఆస్వాదిస్తానంటూ తేల్చి చెప్పాడు. ఐపీఎల్‌లో ఆడటంపై ధోనీ సంకేతాలు ఇవ్వడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలోనూ జోష్ కనిపిస్తోంది. తాజాగా ఆ ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ కూడా స్పందించారు. ధోనీ సిద్ధంగా ఉన్నప్పుడు తమకు అంతకంటే ఏం కావాలంటూ వ్యాఖ్యానించారు.

వాస్తవానికి గత ఐదేళ్లుగా కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న ధోనీ.. తన ఫిట్‌నెస్‌ని కాపాడుకుంటున్నాడు. 43 ఏళ్ల వయసులోనూ వికెట్ల వెనుక ఉత్సాహంగా ఉన్నా.. పాత వెన్నునొప్పి గాయం, మోకాలి గాయం ధోనీని ఇబ్బంది పెడుతున్నాయి. గత సీజన్ ముగిసిన తర్వాత మోకాలికి సర్జరీ కూడా చేయించుకున్నాడు. దాంతో ఐపీఎల్ 2025లో ధోనీ ఆడటం కష్టమని చాలామంది అంచనా వేశారు. కానీ ఫిట్ నెస్ సాధించిన ధోనీ వచ్చే సీజన్ లో ఆడేందుకు రెడీ అయ్యాడు. కాగా ఈ సారి ధోనీని చెన్నై అన్ క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో రిటైన్ చేసుకోబోతోంది. అంతర్జాతీయ క్రికెట్‌కి ఐదేళ్ల పాటు దూరంగా ఉన్న ఆటగాళ్లను ‘అన్‌క్యాప్డ్’ ప్లేయర్‌గా పరిగణించాలని నిబంధన చేర్చారు. ధోనీ కోసమే ఈ రూల్‌ని తీసుకొచ్చారని వార్తలు వినిపించాయి.

సాధారణంగా ఇంటర్నేషనల్ ప్లేయర్‌ను ఐపీఎల్ ఫ్రాంఛైజీలు రిటెన్ చేసుకోవాలంటే భారీ ధరని వెచ్చించక తప్పదు. అయితే.. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ అయితే.. ఇప్పుడున్న రూల్ ప్రకారం 4 కోట్లతోనే రిటెన్ చేసుకోవచ్చు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు ఆరుగురు ఆటగాళ్లను రిటెన్ చేసుకోవచ్చు. ఇందులో రైట్ టు మ్యాచ్ కార్డు కూడా ఉంది. అంటే ఐదుగురు ఆటగాళ్లని డైరెక్ట్‌గా రిటెన్ చేసుకోవచ్చు.. ఒకరిని మాత్రం వేలంలో ఆర్టీఎం కార్డుతో అప్పుడు పలికిన ధరకి తీసుకోవచ్చు. ఓవరాల్‌గా వేలానికి ప్రతి ప్రాంఛైజీకి 120 కోట్లు కేటాయించగా.. దీనిలో 75 కోట్లు రిటెన్షన్ కోసం ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. ఒకవేళ ఐదుగురు ఆటగాళ్లని రిటెన్ చేసుకోవాలని అనుకుంటే.. వరుసగా 18 కోట్లు, 14 కోట్లు, 11 కోట్లు, 18 కోట్లు, 14 కోట్లు ఇలా ప్రాధాన్యక్రమంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఉంటే కేవలం 4 కోట్లు చెల్లిస్తే సరిపోతుంది.