ధోనీ రికార్డ్ సమం.. ధృవ్ జురెల్ అరుదైన ఘనత

దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీలో పలువురు యువ క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. వికెట్ల వెనుక యువ కీపర్ ధృవ్ జురెల్ అదరగొడుతున్నాడు. ఇండియా ఏ జట్టుకు ఆడుతున్న జురెల్ తాజాగా ధోనీ పేరిట ఉన్న అరుదైన రికార్డును అందుకున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 8, 2024 | 03:25 PMLast Updated on: Sep 08, 2024 | 3:25 PM

Dhonis Record Is Equal Dhruv Jurel Is A Rare Achievement

దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీలో పలువురు యువ క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. వికెట్ల వెనుక యువ కీపర్ ధృవ్ జురెల్ అదరగొడుతున్నాడు. ఇండియా ఏ జట్టుకు ఆడుతున్న జురెల్ తాజాగా ధోనీ పేరిట ఉన్న అరుదైన రికార్డును అందుకున్నాడు. దులీప్ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక క్యాచ్ లు పట్టిన కీపర్ గా ధోనీ రికార్డును సమం చేశాడు. 2004-05 సీజన్ లో ఈస్ట్ జోన్ కు ఆడినప్పుడు ధోనీ ఒకే ఇన్నింగ్స్ లో 7 క్యాచ్ లు అందుకున్నాడు. తాజాగా ఇండియా ఎ జట్టు తరపున జురెల్ కూడా ఏడు క్యాచ్ లు పట్టాడు. కష్టమైన రెండు క్యాచ్ లను కూడా అందుకోవడం ద్వారా తన కీపింగ్ స్కిల్స్ ను ఈ యువ వికెట్ కీపర్ మరోసారి చాటిచెప్పాడు.